Shah Rukh Khan - AbRam Khan: అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేసిన షారూఖ్  చిన్నబ్బాయి అబ్రహమ్.

Shah Rukh Khan – AbRam Khan: అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేసిన షారూఖ్ చిన్నబ్బాయి అబ్రహమ్.

Anil kumar poka

|

Updated on: Dec 17, 2023 | 3:59 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‏కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవుతుంది. షారుఖ్ చిన్న కుమారుడు అబ్‏రామ్ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ పాఠశాలలో చదువుకుంటున్నాడు. ఇటీవల ఈ స్కూల్లో వార్షిక దినోత్సవం ఎంతో గ్రాండ్‏గా జరిగింది. ఈ వేడుకలో అబ్రహమ్ ప్రదర్శన స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇన్నాళ్లు తండ్రితో ఎంత క్యూట్ గా కనిపించిన అబ్‏రామ్.. స్కూల్ వార్షిక దినోత్సవ వేడుకలో మాత్రం తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‏కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవుతుంది. షారుఖ్ చిన్న కుమారుడు అబ్‏రామ్ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ పాఠశాలలో చదువుకుంటున్నాడు. ఇటీవల ఈ స్కూల్లో వార్షిక దినోత్సవం ఎంతో గ్రాండ్‏గా జరిగింది. ఈ వేడుకలో అబ్రహమ్ ప్రదర్శన స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇన్నాళ్లు తండ్రితో ఎంత క్యూట్ గా కనిపించిన అబ్‏రామ్.. స్కూల్ వార్షిక దినోత్సవ వేడుకలో మాత్రం తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా నాటకం ముగింపు సమయంలో తన తండ్రి షారుఖ్ ఖాన్ సిగ్నేచర్ ఫోజు.. అదే చేతులు చాచి రొమాంటిక్‌గా నిలబడతూ… తన తండ్రిని ఇమిటేట్ చేశాడు. అదే షోలో ఉన్న వాళ్లందరితో పాటు.. తన తల్లి గౌరీఖాన్‌ను కూడా.. ఆశ్చర్యపరిచాడు.

అంతేకాదు తన పర్ఫార్మెన్స్ చివరగా.. “గివ్ మీ హగ్.. ఐ లవ్ హగ్స్” అంటూ షారుఖ్ మరో సిగ్నేచర్ ఫోజును కూడ చేసి చూపించాడు. ఇక చిన్నోడి మూమెంట్స్‌కు తోడు.. బ్యాగ్రౌండ్‏లో దిల్ వాలే దుల్హనియా జాయేంగే ట్యూన్ ప్లే అవ్వడం అందర్నీ అరిచేలా చేసింది. ఇక ఆ తరువాత అబ్‏రామ్ తోటి క్లాస్ మేట్స్ అతడిని హాగ్ చేసుకుంటూ కనిపించాడు. అయితే అబ్‏రామ్ నటన, తన సిగ్నేచర్ ఫోజు ఇవ్వడం చూసి అక్కడే ఉన్న షారుఖ్ పొంగిపోయాడు. ఇందుకు సంబంధింన వీడియో… ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జూనియార్ షారుఖ్ అనే టైటిల్‌ అబ్‌రామ్‌కు వచ్చేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.