Sheela: లైంగిక వేధింపులు అంటే ముద్దు పెడుతూ.. ఫోటోలు దిగాలా.?
మలయాళీ సినీరంగంలో మహిళలపై జరుగుతున్న వేధింపులు.. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటపెట్టింది. దీంతో పలువురు నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. ఇక ఈక్రమంలోనే మహిళలపై లైంగిక వేధింపుల గురించి రియాక్ట్ అయ్యారు సీనియర్ నటి షీలా. రియాక్టవ్వడమే కాదు.. ఇలాంటి కేసుల్లో పోలీసులు సాక్ష్యాలు అడుగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
మలయాళీ సినీరంగంలో మహిళలపై జరుగుతున్న వేధింపులు.. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటపెట్టింది. దీంతో పలువురు నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. ఇక ఈక్రమంలోనే మహిళలపై లైంగిక వేధింపుల గురించి రియాక్ట్ అయ్యారు సీనియర్ నటి షీలా. రియాక్టవ్వడమే కాదు.. ఇలాంటి కేసుల్లో పోలీసులు సాక్ష్యాలు అడుగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అసలు ఆ సాక్ష్యాలు ఎలా ఇవ్వాలో పోలీసులే చెప్పాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఈమె. ఇంతకీ సీనియర్ నటి షీలా… ఏం మాట్లాడారంటే.. “లైంగిక వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా.. కోర్టుకు వెళ్లినా.. సాక్ష్యం ఏమిటి? అని అడుగుతున్నారు. అంటే ఎవరైనా పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని కౌగిలించుకుని ముద్దులు పెడితే, వెంటనే ప్రూఫ్ కోసం సెల్ఫీ తీసుకోవాలా?, మీరు హగ్ చేసుకుంటే నేను ఫోటో తీసుకుంటాను అంటూ ఎవరైన మహిళ అడిగాలా.?
గతంలో ఎవరైనా ల్యాండ్‌లైన్ ఫోన్‌కు ఫోన్ చేసి ఏదైనా మాట్లాడితే అది రికార్డు అయ్యేదా? అలాంటప్పుడు ప్రూఫ్ ఎలా చూపిస్తారు ? ” అంటూ ప్రశ్నించారు షీలా.! డబ్ల్యూసీసీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, అందులోని నటీమణుల కెరీర్‌లు పోయాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు పవర్ గ్రూప్ అంటే ఏమిటో అర్థం కావడం లేదని షీలా వ్యాఖ్యానించారు. కందిత్ సారమ్మ, కళ్లిచెళ్లమ్మ వంటి సినిమాలు వచ్చిన తర్వాత కూడా తనకు పురుషుల కంటే ఎక్కువ పారితోషికం రాలేదని.. మహిళలకు ప్రాధాన్యత ఉన్న సినిమా అయినప్పటికీ వారికి ఎక్కువ పారితోషికం ఇవ్వాలని అన్నారు. ప్రస్తుతం షీలా చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.