Save The Tiger-2 Review: హిట్టా.? ఫట్టా.? సేవ్ ది టైగర్స్ 2 ఇలా ఉంటుంది అనుకోలేదా.?

|

Mar 15, 2024 | 9:39 PM

క్రైమ్, సప్సెన్స్‌ సిరీస్‌లే ఎక్కువ అందర్నీ అట్రాక్ట్ చేస్తున్న ఈ జామానాలో... అది కూడా తెలుగులో.. కామెడీ జానర్లో..! వన్‌ ఇయర్ బ్యాక్ వచ్చింది సేవ్‌ ది టైగర్ సిరీస్. అందర్నీ కడుపుబ్బ నవ్వించింది. తెలుగులో వచ్చిన సిరీసుల్లో వన్‌ ఆఫ్ ది మోస్ట్ వాచబుల్ సిరీస్‌గా ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. ఇక తాజాగా ఈ సిరీస్‌కే సీక్వెల్ వచ్చింది. సేవ్‌ ది టైగర్ సీజన్ 2 తాజాగా హాట్‌ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది.

క్రైమ్, సప్సెన్స్‌ సిరీస్‌లే ఎక్కువ అందర్నీ అట్రాక్ట్ చేస్తున్న ఈ జామానాలో… అది కూడా తెలుగులో.. కామెడీ జానర్లో..! వన్‌ ఇయర్ బ్యాక్ వచ్చింది సేవ్‌ ది టైగర్ సిరీస్. అందర్నీ కడుపుబ్బ నవ్వించింది. తెలుగులో వచ్చిన సిరీసుల్లో వన్‌ ఆఫ్ ది మోస్ట్ వాచబుల్ సిరీస్‌గా ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. ఇక తాజాగా ఈ సిరీస్‌కే సీక్వెల్ వచ్చింది. సేవ్‌ ది టైగర్ సీజన్ 2 తాజాగా హాట్‌ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. అసలు ఈ సిరీస్‌ ఎలా ఉంది. సీజన్‌1 లాగే అందర్నీ కడుపుబ్బా నవ్విస్తుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం!

మహి వి రాఘవ..! ఆనందో బ్రహ్మ సినిమాతోనే.. తన కామెడీ టేకింగ్‌ ఏంటో అందరికీ చూపించారు. తన కంటెంట్‌లో.. డైరెక్షన్లో వెర్సటాలిటీ చూపిస్తూ.. షో మేకర్ అవుతున్నారు. ఇక సేవ్‌ ది టైగర్ సీజన్‌ 2 లో మరో సారి మహి వి రాఘవే షో మేకర్ గా నిలిచారు. మెగుడు పెళ్లాల మధ్య కామెడీని క్రియేట్ చేసి.. ఆ కామెడీ వెనక డ్రామా అండ్ ఎమోషన్‌ను యాడ్ చేసి… అంతర్లీనంగా ఓ మెసేజ్‌తో.. చాలా బ్రిలియంట్‌గా తన సిరీస్‌ను ఎండ్ చేశారు మహి. హిలయరస్ ఎంటర్‌టైనర్‌గా.. సీరిస్‌ను మలిచారు. ఇక మహికి తోడు.. ఈ సిరీస్‌ డైరెక్టర్ అరుణ్ కొత్తపల్లి కూడా.. సిరీస్‌ను చక్కగా నడిపించాడు.

ఇక ఈ సిరీస్‌… మొదటి సీజన్‌ ఎక్కడ ముగిసిందో.. సరిగ్గా అక్కడే మొదలువుంది. ట్రైలర్‌లో చూపించినట్టు.. మన ముగ్గురు హీరోలు.. అదే! విక్రమ్‌ అలియాస్ చైతన్య కృష్ణ, రాహుల్ అలియాస్ అభినవ్‌ గోమఠం, గంటా రవి అలియాస్ ప్రియదర్శిలను… హంసలేఖ అలియాస్ సీరత్ కపూర్ ఎక్కడనే ప్రశ్నతో.. పోలీస్‌ ఇంటరాగేషన్‌తో సిరీస్‌ మొదలవుతుంది. ఆ తరువాత మిస్పైందనుకున్న సీరత్ కపూర్‌ బయటికి వస్తుంది. ఇక సీరత్ కపూర్‌ ఎంట్రీతో మన హీరోల లైఫ్ ఎలా చేంజ్‌ అయ్యింది. మధ్యలో వాళ్ల భార్యలు రేఖ అలియాస్ దేవియాని శర్మ, మాధురి అలియాస్ పావని గంగిరెడ్డి, హైమావతి అలియాస్ జోర్దార్ సుజాత.. కూడా ఎందుకు మారారు అనేది.. ఈ సీరిస్‌లో చూపించారు మహి.

మొత్తం 7 ఎమిసోడ్స్‌ గా ఉన్న ఈ సీరిస్‌.. ఎక్కడా బోర్‌ కొట్టకుండానే సాగుతుంది. పేరుకు తగ్గట్టే..ఈ సిరీస్‌లో కామెడీ ఉంటుంది. డ్రామా ఉంటుంది. అక్కడడక్కడా ఎమోషనల్‌ సీన్లు పండాయి. ఇక ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ… ముగ్గురి నటన బావుంది. అయితే… కుమార్తె పెద్దమనిషి అయ్యాక ఆమెతో మాట్లాడిన సన్నివేశంలో గానీ, స్కూల్‌లో తన గురించి కుమార్తె మాట్లాడిన వీడియో చూసేటప్పుడు గానీ ప్రియదర్శి నటన టాప్ క్లాస్. ఆయన భావోద్వేగాలు పలికించిన తీరు అద్భుతం. అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్, ఆ డైలాగ్ డెలివరీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటిలా బాగా చేశారు. రాహుల్ పాత్రలో చైతన్యకృష్ణ జీవించారు. హంసలేఖగా సీరత్ కపూర్ చక్కగా నటించారు. రోహిణి మరోసారి మాస్ మెయిడ్ క్యారెక్టర్‌లో నవ్వించారు. ఇక వీరి యాక్టింగ్‌కు తోడు అజయ్ అరసాడ సంగీతం బాగుంది. కథతో పాటు సాగుతుంటుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా ఏ క్లాస్‌. ఇక ఒక్క మాటలో ఈ సిరీస్‌ గురించి చెప్పాలంటే.. సేవ్‌ ద టైగర్స్.. డేట్ సేవ్‌ చేసుకుని మరీ చూడాల్సిన సిరీస్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..