సంక్రాంతి బరిలో ట్విస్ట్ ఇచ్చిన రవితేజ.. మిగతా హీరోలకు ప్రెజర్ తప్పదా

Edited By:

Updated on: Dec 23, 2025 | 3:39 PM

సంక్రాంతి బరిలో రవితేజ తీసుకున్న కీలక నిర్ణయం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాన్ని సాధారణ టికెట్ ధరలకే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ అనూహ్య నిర్ణయం ఇతర సంక్రాంతి సినిమాలపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది, ముఖ్యంగా మీడియం రేంజ్ చిత్రాల నిర్మాతలు టికెట్ ధరలపై పునరాలోచించాల్సి వస్తుంది.

తెలుగు తెరపై సంక్రాంతి ఫైట్ సస్పెన్స్‌ సినిమాను తలపిస్తోంది. టాలీవుడ్ నుంచి ఐదు సినిమాలు పోటీ పడుతుండటంతో, ఏ సినిమా ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రేక్షకులను ఆకర్షించేందుకు చిత్ర నిర్మాతలు చేస్తున్న ప్రణాళికలు థ్రిల్లర్ సినిమాను పోలి ఉన్నాయి. సంక్రాంతి బరిలో పోటీకి సిద్ధమవుతున్న రవితేజ, తన చిత్ర విడుదలతో ఆసక్తికరమైన ట్విస్ట్ ఇచ్చారు. పొంగల్ బరిలో కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించేందుకు, ఎలాంటి టికెట్ హైక్స్ లేకుండానే భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నిర్ణయం ఇప్పుడు మిగతా సినిమా బృందాలను ఒత్తిడిలోకి నెట్టింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మారుతున్న ప్రమోషన్‌ ట్రెండ్‌… మాయ చేస్తున్న ఏఐ

Allu Arjun: అల్లు అర్జున్‌ నెక్స్ట్ సినిమా పై క్లారిటీ వచ్చేదెప్పుడు?

The Raja saab: రాజాసాబ్‌ను టార్గెట్ చేసిందెవరు ?? ప్రభాస్ సినిమాకే ఎందుకిలా జరుగుతోంది

2026 మీదే ఆశలు.. కొత్త ఏడాది కలిసొస్తుందా..?

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు

Published on: Dec 23, 2025 03:38 PM