Samantha: ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను

Updated on: Dec 28, 2025 | 4:46 PM

టాలీవుడ్ స్టార్ సమంత 2025 సంవత్సరం తన జీవితంలో మర్చిపోలేనిదని పేర్కొంది. వ్యక్తిగత, వృత్తిపరమైన విజయాలను పంచుకుంటూ, భర్త రాజ్ నిడిమోరుతో అరుదైన పెళ్లి ఫోటోను క్రిస్మస్ రోజున షేర్ చేసింది. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి విజయం సాధించానని, ఈ ఏడాది తన జీవితాన్ని మార్చిందని తెలిపింది. ఈ భావోద్వేగ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

2025 తన జీవితంలో మర్చిపోలేని సంవత్సరమన్నారు ప్రముఖ టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ సమంత. ఈ ఏడాది తన జీవితంలో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందంటూ తన సోషల్‌ మీడియా ఖాతాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. 2025లో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో కీలక మైలురాళ్లను ఈన పోస్టులో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఉన్న అరుదైన పెళ్లి ఫోటోను షేర్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేసారు. 2025 ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో, క్రిస్మస్ రోజున సమంత తన ఏడాది జ్ఞాపకాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. డిసెంబర్ 25 గురువారం చేసిన ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఫోటోలు, వీడియోలతో పాటు “కృతజ్ఞతతో నిండిన సంవత్సరం” అంటూ ఇచ్చిన క్యాప్షన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సామ్‌ షేర్ చేసిన ఫోటోలలో సమంత–రాజ్ పెళ్లి దుస్తుల్లో కనిపించిన అన్‌సీన్ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఫోటోలో రాజ్ ఫన్నీగా ఎక్స్‌ప్రెషన్ ఇవ్వగా, సమంత చిరునవ్వుతో కనిపించింది. వీటితో పాటు జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియో, తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ‘శుభం’ సినిమాలో క్యామియో లుక్, క్రిస్మస్ ట్రీతో ఉన్న ఫోటోలను కూడా ఆమె షేర్ చేసింది. ఈ ఫొటోలు నెట్టింట తెగ‌వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత 2025 గురించి మాట్లాడారు. ఈ ఏడాది తాను వివాహబంధంలోకి అడుగుపెట్టానని, అది గొప్ప విషయం అన్నారు. నిర్మాతగా సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నానన్న సామ్‌ ఇవి రెండూ తన జీవితాన్ని మార్చాయని పేర్కొన్నారు. ఓ కార్యక్రమం తర్వాత అభిమానుల అత్యుత్సాహం కారణంగా ఆమె ఇబ్బంది పడ్డారు. దానిపై మాట్లాడుతూ.. వారంతా తనను అభిమానించే వారేనని, వారిగురించి భయపడాల్సిన అవసరం లేదని, వాళ్లు ఎలాంటి హానీ కలిగించరని పేర్కొన్నారు. ప్రస్తుతం సామ్‌ ‘మా ఇంటి బంగారం’ సినిమాతో బిజీగా ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌

విద్యుత్‌ స్తంభం ఎక్కిన ఎమ్మెల్యే.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే