Samantha: పెళ్లి గౌను ను నల్లగా మార్చేసిన సమంత.! ఇకపై ఇలానేనా..

|

Apr 27, 2024 | 11:55 AM

సమంత, నాగచైతన్య! వీరు విడిపోయి నాలుగేళ్లు కావొస్తున్న ఇద్దరి గురించి నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. చైతూకు సంబంధించిన జ్ఞాపకాలను ఇప్పటికే చెరిపేసింది సామ్. ఇన్ స్టాలో ఫోటోస్ డెలీట్ చేసింది. తన ఒంటిపై ఉన్న చై పేరు టాటూ తొలగించింది. ఇక ఇప్పుడు పెళ్లినాటి డ్రెస్‌ను కూడా రీమోడలింగ్ చేయించేసి.. నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

సమంత, నాగచైతన్య! వీరు విడిపోయి నాలుగేళ్లు కావొస్తున్న ఇద్దరి గురించి నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. చైతూకు సంబంధించిన జ్ఞాపకాలను ఇప్పటికే చెరిపేసింది సామ్. ఇన్ స్టాలో ఫోటోస్ డెలీట్ చేసింది. తన ఒంటిపై ఉన్న చై పేరు టాటూ తొలగించింది. ఇక ఇప్పుడు పెళ్లినాటి డ్రెస్‌ను కూడా రీమోడలింగ్ చేయించేసి.. నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. 2017లో క్రిస్ట్రియన్ , హిందూ సంప్రదాయాల ప్రకారం చైతూ, సమంత వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత వీరిద్దరి విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ కెరీర్ లో ముందుకు సాగుతున్నారు. అయితే సామ్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లిలో తాను ధరించిన తెల్లటి గౌనును మార్చేసి నల్లటి మోడ్రన్ డ్రెస్ గా మార్చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ సుధీర్ఘ నోట్ రాసుకొచ్చింది.

ఇక ఆ నోట్‌లో సామ్ ఏం రాసుకొచ్చిందంటే.. “ఇకపై నేను ధృడంగా ఉండడం మర్చిపోలేము. నాకు ఎంతో ఇష్టమైన గౌనును రీమోడలింగ్ చేయించి ఈ కార్యక్రమం కోసం ఉపయోగించాను. దీనిని అందంగా మార్చిన క్రేశాబజాజ్ కు కృతజ్ఞతలు. నా అలవాట్లను మార్చుకోవడం.. జీవనశైలిని మరింత స్థిరంగా చేసుకోవడంలో పాత దుస్తులను రీమోడలింగ్ చేయించడం కూడా ఒకటి. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. ‘ఎల్లే లీడర్స్ ఆఫ్ ఛేంజ్’ గా నన్ను ఎంపిక చేసినవారికి ధన్యవాదాలు ” అంటూ రాసుకొచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.