సమంత ఇన్‏స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా ?? క్షమాపణలు చెప్పిన సమంత డిజిటల్‌ మేనేజర్‌

సమంత (Samantha) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారో తెలిసిన విషయమే. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ.. ఫోటోస్ అప్లోడ్ చేస్తూ ఫుల్ యాక్టివ్ గా ఉంటారు.

Phani CH

|

Jul 07, 2022 | 8:34 PM


సమంత (Samantha) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారో తెలిసిన విషయమే. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ.. ఫోటోస్ అప్లోడ్ చేస్తూ ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. సమంత చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంది. సామ్ సోషల్ మీడియా ఖాతాల పట్ల ఫాలోవర్స్ సైతం ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇటీవల సమంత ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేసిన ఓ ఫోటో గందరగోళం సృష్టించింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫోటో షేర్ చేస్తూ నా ప్రజలే నా బలం, నా ధైర్యం నా నమ్మకం అంటూ క్యాప్షన్ ఉంది. దీంతో సామ్ ఖాతాలో కేటీఆర్ ఫోటో రావడమేంటంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. రాజకీయాల గురించి ఎప్పుడూ మాట్లాడని సామ్ ఇలా పోస్ట్ పెట్టడానికి కారణాలేంటి అంటూ నెట్టింట సందేహాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సమంత ఇన్ స్టా అకౌంట్ హ్యాండిల్ టీం రంగంలోకి దిగింది. సామ్ ఇన్ స్టా ఖాతా హ్యాక్ చేయబడిందని.. అందుకు కారణమైనవారిని పట్టుకుంటామంటూ సమంత డిజిటల్ మేనేజర్ శేషంక క్షమాపణలు చెప్తూ.. నోట్ విడుదల చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆర్ఆర్ఆర్ ట్రోల్స్ పై కీరవాణి ట్వీట్.. ఆ తల్లి సంకల్పమే కనిపిస్తుందంటూ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu