Deepika Padukone: పెళ్లయితే ఏం.. రొమాంటిక్ సీన్స్ చేయకూడదా ?? నా భర్తకు లేని అభ్యంతరం మీకెందుకు ??
బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా దీపికా పదుకొణె క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. పెళ్లి తర్వాత కూడా దీపికా జోరు కొనసాగిస్తున్నారు. వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.
బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా దీపికా పదుకొణె క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. పెళ్లి తర్వాత కూడా దీపికా జోరు కొనసాగిస్తున్నారు. వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అయితే వివాహం తర్వాత కూడా ఆమె రొమాంటిక్ చిత్రాల్లో నటించడం పై భిన్న రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంకా రొమాంటిక్ సినిమాల్లో నటించడం ఏంటీ అంటూ నెటిజన్స్ నెట్టింట రచ్చ చేస్తున్నారు. అయితే తాజాగా తాను సినిమాలు చేయడంపై షాకింగ్ కామెంట్స్ చేసారు దీపికా. గతంలో హీరోయిన్‌కు పెళ్లి అయితే కెరీర్ ముగిసిపోయేది. మహా అయితే సపోర్టింగ్ రోల్స్‌లో కంటిన్యూ అయ్యేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఈ జనరేషన్ హీరోయిన్లు.. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ కెరీర్ వేరు వేరని ప్రూవ్ చేస్తున్నారు. ఈ విషయంలోనే బాలీవుడ్ నటి దీపికా పదుకొనే హాట్ కామెంట్స్ చేశారు. పెళ్లైన హీరోయిన్లను తెర మీద చూసి మేల్ ఈగో హర్ట్ అవుతుందని సీరియస్ కామెంట్స్ చేశారు దీపికా పదుకొనే. తన మూవీ సెలక్షన్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సమంత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా ?? క్షమాపణలు చెప్పిన సమంత డిజిటల్ మేనేజర్