లిక్కర్ తాగి బిగ్ బాస్‌కు ? సల్మాన్ తీరుపై విమర్శలు! ఖండిస్తున్న ఫ్యాన్స్‌

Updated on: Oct 25, 2025 | 1:14 PM

బిగ్ బాస్ హిందీ రియాలిటీషోకు ఎప్పటినుంచో హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. తన హోస్టింగ్ తో ఈ సెలబ్రిటీ రియాలిటీ షోకు మరింత క్రేజ్ తీసుకొచ్చాడు. ముఖ్యంగా వారాంతంలో సల్మాన్ హాజరయ్యే బిగ్ బాస్ ఎపిసోడ్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. ఈ షోలో సల్లూ భాయ్ ధరించే దుస్తులు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

కానీ లేటెస్ట్ ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్ పై ఆరోపణలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ మద్యం తాగి హోస్ట్ చేశాడని నెట్టింట కామెంట్స్ కనిపిస్తున్నాయి. అందుకు ఈ షోలో సల్మాన్ ఖాన్ ప్రవర్తన భిన్నంగా ఉండడమే కారణం. రీసెంట్ వీకెండ్ షోలో.. సల్మాన్‌ ముఖం బాగా ఉబ్బిపోయినట్లు కనిపించింది. కళ్లు కూడా వాచిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన చాలా మంది సల్మాన్ ఖాన్ తాగి ఉన్నాడని విమర్శిస్తున్నారు. అయితే దీనిని సల్మాన్ అభిమానులు ఖండిస్తున్నారు. సల్మాన్ బిహేవియర్ పై ఓ క్లారిటీ కూడా ఇస్తున్నారు. మహాభారత్ హిందీ సీరియల్‌లో నటించిన పంకజ్ ధీర్ ఇటీవలే కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలకు సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. ఆ తర్వాత రియాద్ వెళ్లి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమిర్, షారుఖ్ ఖాన్‌లతో పాటు సల్మాన్ ఖాన్ వేదికను పంచుకున్నారు. ఆ తర్వాత, అక్కడి నుంచి నేరుగా కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి ఇండియాకు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్‌కు వచ్చాడు. ఈ బిజీ షెడ్యూల్ కారణంగానే సల్మాన్ ఖాన్ సరిగ్గా నిద్రపోలేదని ఫ్యాన్స్ అంటున్నారు. అందుకే అతని కళ్ళు ఉబ్బిపోయాయి. నిద్ర లేకపోవడం వల్ల అతను సరిగ్గా నిలబడలేకపోయాడు కూడా. ఈ క్రమంలోనే కొంతమంది సల్మాన్ ను తప్పుగా అర్థం చేసుకున్నారని అభిమానులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హాట్సాఫ్ భయ్యా.. ఆరుగురిని కాపాడిన హీరో .. కర్నూలు బస్సు ప్రమాదం

బాలయ్యపై జగన్‌ వ్యాఖ్యలు.. భగ్గుమంటున్న కూటమి నేతలు, మంత్రులు

Weather Update: ఏపీకి తప్పని తుపాను ముప్పు

కర్నూలులో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం

శ్రీలీల కెరీర్ ఎక్కడ గాడి తప్పుతోంది