ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు

|

Jan 09, 2025 | 2:56 PM

బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ గత కొన్ని రోజులుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఆయన సినిమా సూపర్ హిట్ అయ్యి చాలా రోజులైంది. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. దీనికి తోడు వ్యక్తిగత జీవితంలోనూ సల్మాన్ ఇబ్బందుల ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా లారెన్స్ బిష్ణోయ్, అతని సహచరులు సల్మాన్ ఖాన్‌ను చంపుతామంటూ బెదిరిస్తున్నారు.

ఇప్పటికే సల్మాన్ ఖాన్ సన్నిహితుడు, ప్రముఖ రాజకీయ నాయకుడైన బాబా సిద్ధిఖీని.. బిష్ణోయ్ అనుచరులు హతమార్చారు. పరిస్థితులు ఎలా ఉన్నా.. తన సినిమా షూటింగ్‌ పనులను కొనసాగిస్తున్నాడు సల్మాన్. ఇక కొన్ని నెలల క్రితం సల్మాన్ ఖాన్ ఉంటోన్న గెలాక్సీ అపార్ట్ మెంట్ పై కొందరు దుండగులు దాడి చేశారు. అపార్ట్ మెంట్ లోని గాజు కిటికీలపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పరారయ్యారు. మళ్లీ అలాంటి దాడి జరిగే అవకాశం ఉండడంతో ఇప్పుడు సల్మాన్ ఖాన్ తన నివాసానికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు అమర్చారు. తాజాగా గెలాక్సీ అపార్ట్మెంట్ కిటికీలకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు సల్మాన్ ఖాన్ ఇంటి భద్రతను కూడా పెంచినట్లు సమాచారం.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kannappa: పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం

శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన

Vishal: ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్

TOP 9 ET News: గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్