Sai Dharam Tej: తన గాయాన్ని చూపించిన తేజు.! అందుకే కాబోలు మాట తడబడుతోంది..
మెగా కాంపౌండ్ నుంచి హీరోగా పరిచయమై తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్. సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే బైక్ యాక్సిడెంట్ కారణంగా ఆసుపత్రి పాలయ్యాడు. కోమా వరకు వెళ్లి వచ్చాడు. అయితే అంతే వేగంగా కోలుకుని.. తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. విరూపాక్ష సినిమాతో 100 కోట్ల క్లబ్‌లోకి కూడా చేరిపోయాడు. కానీ సర్‌ప్రైజింగ్‌లీ సినిమాలకు కాస్త గ్యాబిచ్చాడు.
మెగా కాంపౌండ్ నుంచి హీరోగా పరిచయమై తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్. సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే బైక్ యాక్సిడెంట్ కారణంగా ఆసుపత్రి పాలయ్యాడు. కోమా వరకు వెళ్లి వచ్చాడు. అయితే అంతే వేగంగా కోలుకుని.. తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. విరూపాక్ష సినిమాతో 100 కోట్ల క్లబ్‌లోకి కూడా చేరిపోయాడు. కానీ సర్‌ప్రైజింగ్‌లీ సినిమాలకు కాస్త గ్యాబిచ్చాడు. అయితే ఉన్నట్టుండి.. ఓ ఇంటర్వ్యూ కారణంగా.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు ఈ హీరో. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన సాయి ధరమ్ తేజ్.. పోయిన ఇయర్ ఎలా గడించిందనేది చెప్పుకొచ్చాడు. విరూపాక్ష సినిమా సక్సెస్ కంటే ఆసుపత్రిలో ఉన్నప్పుడు తన కోసం ప్రతీ ఒక్కరూ ప్రార్థించడం.. తన మీద ప్రేమ చూపించడమే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని.. వారి అభిమానాన్ని సంపాదిచడమే పెద్ద సక్సెస్ అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ ప్రేమను చూసే తనకు ఎక్కువ సంతోషం కలిగిందని అన్నాడు. అయితే ఈ వీడియోలో తేజు గొంతుపై గాయపు గుర్తులు అవుపించడం.. అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. గొంతు దగ్గర డీప్ కట్ ఉండడంతోనే… మాట్లాడేందుకు తడబడుతున్నాడనే మాట కూడా నెట్టింట వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.