ఛాతీలోకి 7 బుల్లెట్లు.. వీరమరణం.. ‘కాంతార 2’ హీరోయిన్ తండ్రి ఎవరో తెలుసా ??

Updated on: Oct 07, 2025 | 6:12 PM

కన్నడ సినిమాలలో తనదైన ముద్ర వేసిన రుక్మిణి వసంత్ ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో పేరు తెచ్చుకున్న రుక్మిణి, తాజాగా ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రంలో యువరాణి పాత్రలో ప్రేక్షకులను మెస్‌మరైజ్‌ చేసింది. తన నటన, అద్భుత యాక్షన్ సీక్వెన్సులతో అందరినీ ఆకట్టుకుంటూ, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తాజాగా ఆమె ఫేమ్ పెరగడంతో నెటిజన్లు “రుక్మిణి వసంత్ ఎవరు?” అంటూ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రుక్మిణి తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ భారత సైన్యంలో అధికారిగా పనిచేశారు. జమ్మూ కాశ్మీర్, సిక్కిం, పఠాన్‌కోట్, బెంగళూరులో సేవలు అందించారు. 2007లో ఉరి సెక్టర్ వద్ద పాక్‌ ఉగ్రవాదుల దాడిని ధైర్యంగా ఎదుర్కొని వీర మరణం పొందారు.ఈ యుద్ధంలో ఆయన ఛాతిలో ఏకంగా ఏడు బుల్లెట్లు తగిలినట్లు సమాచారం. దేశం కోసం ప్రాణం అర్పించిన కల్నల్ వసంత్‌కు భారత ప్రభుత్వం అత్యున్నత సైనిక గౌరవం ‘అశోక చక్ర‌ను ప్రదానం చేసింది. కేవలం ఏడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన రుక్మిణి వసంత్, తండ్రి జ్ఞాపకాలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేననీ అన్నారు. ప్రతి సంవత్సరం తండ్రి జయంతి, వర్ధంతి రోజున ఆయనను స్మరిస్తూ సోషల్ మీడియాలో భావోద్వేగపూరిత పోస్టులు చేస్తూ ఉంటారు. రుక్మిణి కి తల్లి ఓ చెల్లి ఉన్నారు. తల్లి సుభాషిణి, ప్రముఖ భరతనాట్యం డాన్సర్‌. భర్త మరణం తర్వాత ‘వీర్ రత్న ఫౌండేషన్’ అనే సంస్థను స్థాపించి, తనలాంటి సైనిక భార్యలకు మద్దతుగా నిలబడుతున్నారు ఆమె. అంటే, రుక్మిణి తల్లిదండ్రులు ఇద్దరూ దేశం కోసం తమ జీవితాలను అంకితం చేశారు. ఇక ఇప్పుడిప్పుడే సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుంటున్న‌ రుక్మిణి వసంత్, కేవలం అందంతోనే కాకుండా తన నటనతోనూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంతో పాటు, యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో నటిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అనాథ పిల్లల కోసం మై హోం గ్రూప్‌ మరో బృహత్తర కార్యక్రమం

ఈజిప్టులో ఫారో చక్రవర్తి సమాధి.. 20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న తలుపులు

ఫ్రమ్‌ కోర్ట్‌ to ఫుడ్ కోర్ట్ !! మహిళలకు గుర్తింపు, గౌరవాన్ని సాధించడమే లక్ష్యం

మహాత్మా గాంధీపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ దిగజారుడు వ్యాఖ్యలు

కాసుల వర్షం కురిపించిన భూముల వేలం