RRR: అభిమానుల కోసం ఓ సర్‌ప్రైజ్‌.. ఆర్‌.ఆర్‌.ఆర్‌ టీషర్ట్‌లు వచ్చేసాయోచ్‌.. వీడియో

| Edited By: Ravi Kiran

Sep 25, 2021 | 11:34 AM

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో రానున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌..

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో రానున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కొమురం భీమ్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై చిత్ర యూనిట్‌ అంచనాలను ఎప్పటికప్పుడు పెంచేస్తూనే ఉంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా మరోసారి సినిమా విడుదలను మేకర్స్‌ వాయిదా వేశారు. జాగా ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ అభిమానుల కోసం ఓ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమాలో వీరిద్దరి గెటప్స్‌, పాత్రలకు సంబంధించిన లోగోలతో టీషర్టులు, కప్పులు, మాస్కులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని హీరో రానా ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: IPL 2021: సన్‌రైజర్స్‌ ఆటగాడికి కరోనా పాజిటివ్‌.. వీడియో

నేను చనిపోవాలని వారు కోరుకున్నారు! పోప్‌ ఫ్రాన్సిస్‌ సంచలన వ్యాఖ్య! వీడియో

Published on: Sep 25, 2021 09:27 AM