Ram Charan: రామ్‌ చరణ్‌కు కోపం తెప్పించిన స్టార్ డైరెక్టర్

Updated on: Jan 06, 2026 | 1:20 PM

RRR షూటింగ్ సమయంలో రామ్ చరణ్, రాజమౌళి మధ్య జరిగిన అరుదైన సంఘటన ఇది. రాజమౌళి పర్‌ఫెక్షన్ కోసం రీటేకులు ఎక్కువగా అడగటంతో చరణ్ అసహనానికి గురయ్యారట. ఆయన కోపం ప్రదర్శించినా, అది సినిమాపై ప్రేమతోనే వచ్చిందని ఇద్దరూ తరువాత స్పష్టం చేశారు. వారి బలమైన బంధానికి ఇది ఒక ఉదాహరణగా నిలిచింది. (55 words)

పేరుకు సినిమాల్లో యాక్షన్ హీరో అయినా కూడా.. బయట మాత్రం మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ చాలా కూల్‌గా ఉంటాడు. కోపం అనేదే తెలియనట్టు కనిపిస్తుంటాడు. తన జోన్‌లో.. తన ట్రాక్‌లో తాను సైలెంట్‌గా వెళుతుంటాడు. అలాంటి చరణ్ ఓ సారి ఉన్నట్టుండి ఓ స్టార్ డైరెక్టర్‌ మీద కోపం తెచ్చుకున్నాడట. ఆ స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు ఎట్ ప్రజెంట్ పాన్ ఇండియా మార్కెట్‌లో కింగ్‌గా రూల్‌ చేస్తున్న జక్కన్న మీద. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళిని అందరూ ముద్దుగా ‘జక్కన్న’ అని పిలుచుకుంటారు. ఎందుకంటే ఆయన ఒక శిల్పిలా ప్రతి సన్నివేశాన్ని చెక్కుతారు. తనకు కావాల్సిన అవుట్‌పుట్ వచ్చే వరకు నటీనటులను అస్సలు వదలరు. ఈ క్రమంలోనే ‘RRR’ షూటింగ్ సమయంలో రాం చరణ్‌కు రాజమౌళి మీద చాలా కోపం వచ్చిందట. షూటింగ్ మొదలైన కొత్తలో కాకుండా, దాదాపు రెండు మూడేళ్ల పాటు సాగిన ఆ ప్రయాణంలో ఒకానొక దశలో చరణ్ చాలా అసహనానికి గురయ్యారట. ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు రాజమౌళి పర్ఫెక్షన్ కోసం చరణ్‌తో పదే పదే రీటేకులు చేయించారట. ఎండలో, దుమ్ములో గంటల తరబడి కష్టపడుతున్నా రాజమౌళి మాత్రం ‘ఇంకొకసారి.. వన్ మోర్’ అంటూనే ఉండటంతో చరణ్‌కు చిరాకు వచ్చిందట. ఒకానొక టైమ్‌లో తన కోపాన్ని ఆపుకోలేక రాజమౌళి వైపు సీరియస్‌గా చూశారట. అప్పట్లో ఈ విషయం యూనిట్ సభ్యుల మధ్య కూడా పెద్ద చర్చగా మారింది. అయితే రాజమౌళి మాత్రం ఏమీ తెలియనట్టు నవ్వుతూ తన పని తాను చేసుకుపోయేవారట. కేవలం రాం చరణ్ మాత్రమే కాదు, ఎన్టీఆర్ కూడా రాజమౌళి పెట్టే టార్చర్ గురించి చాలా ఇంటర్వ్యూలలో సరదాగా చెప్పారు. రాజమౌళికి కోపం వస్తే చేతిలో ఉన్న మైక్ విసిరికొడతారని, ఆ సమయంలో ఆయన దగ్గరకు వెళ్లాలంటేనే భయమని చరణ్ ఒకసారి గుర్తుచేసుకున్నారు. ఇక మగధీర సినిమాతో మొదలైన వీరిద్దరి బాండింగ్ ట్రిపుల్ ఆర్తో మరింత బలపడింది. రాజమౌళికి చరణ్ ఎంత క్లోజ్ అంటే, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నేరుగా వెళ్ళి అడిగేంత చొరవ ఉంది. అందుకే ఆ కోపం కూడా కేవలం ఆ క్షణానికి మాత్రమే పరిమితమని, అది సినిమాపై ఉన్న ప్రేమ వల్లే వచ్చిందని ఇద్దరూ అంగీకరిస్తారు. పలు సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sai Pallavi: సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూకి అడ్డుగా అమీర్ ఖాన్

అప్పుడు భర్త.. రీసెంట్‌గా భార్య.. సందీప్‌కు దెబ్బ మీద దెబ్బ.. అయినా హిట్ కొట్టాడు

ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే.. సిరిసంపదలు మీవెంటే !!

ఓర్నీ ఏందిరా ఇదీ.. ఇంకెక్కడా చోటు దొరకలేదా నీకు!

పాముకు చేత్తో ఆహారం పెట్టాడు !! కట్ చేస్తే.. చేతి వేలు కాస్తా..