పాతవన్నీ థియేటర్లలో.. కొత్త సినిమాలు ఓటీటీల్లో

Edited By: Phani CH

Updated on: Nov 04, 2025 | 10:23 PM

కొత్త సినిమాలు థియేటర్లలో ఆడుతుండాలి. పాత సినిమాలు టీవీల్లో చూసుకోవాలి... ఇదీ మనందరికి బాగా తెలిసిన, అనుభవంలో ఉన్న విషయం. కానీ ఇప్పుడు సీన్‌ మారింది. కొత్త సినిమాలు ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చేస్తుంటే, పాత సినిమాలు ఫ్రెష్‌గా స్క్రీన్‌ మీదకు వచ్చేస్తున్నాయి. అది కూడా మరిన్ని ముస్తాబులు చేసుకుని..వింటేజ్‌ ఫీల్‌ని ఎంజాయ్‌ చేయడానికి రెడీ అవుతున్నారు ఆడియన్స్.

నేను బాహుబలి సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు రెండు పార్టులను కలిపి సింగిల్‌ పార్టుగా స్క్రీన్‌ మీద చూస్తుంటే ఆ ఫీల్‌ మామూలుగా లేదని రివ్యూ ఇచ్చేశారు మహేష్‌ తనయుడు గౌతమ్‌. నార్త్ కి ఏకంగా ఎక్స్ ప్రెస్‌ వే వేసిన కాంట్రాక్టర్‌ అని రాజమౌళిని మెచ్చుకున్నారు ప్రశాంత్‌ నీల్‌. పాత సినిమాలను సరికొత్తగా ఆస్వాదిస్తున్నారు జనాలు. ఇప్పుడు థియేటర్లోకి దూసుకురావడానికి ముస్తాబవుతోంది శివ. సైకిల్‌ చైన్‌ లాగడాన్ని సిల్వర్‌ స్క్రీన్‌లో చూడ్డానికి రెడీ అయిపోతున్నారు నిన్నటితరం యూత్‌. ఐకానిక్‌ సినిమాను విట్‌నెస్‌ చేయడానికి రెడీ అంటున్నారు. పాత సినిమాలన్నీ వరుసగా థియేటర్లలోకి వచ్చేస్తుంటే నిన్నగాక మొన్న థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఓటీటీల బాట పడుతున్నాయి. థియేటర్లలో మంచి రన్‌ ఉన్నప్పుడే ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. కాంతార విషయంలో అదే జరిగింది. ఆ మధ్య ఓజీ, మిరాయ్‌ విషయంలోనూ ఇదే మాట వినిపించింది. ఇంకాస్త వెసులుబాటు ఉంటే, థియేటర్లలో మరిన్ని కాసులు కురిపించేవనే టాక్‌ నడిచింది. ఏదేమైనా ఇప్పుడు పాత సినిమాలు థియేటర్లలో, కొత్త సినిమాలు ఓటీటీల్లో అనే నినాదం గట్టిగానే వినిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డార్లింగ్‌ ఇష్టపడుతుంటే.. యంగ్‌ టైగర్‌ వద్దనుకుంటున్నారా

ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి.. తల్లినే చంపింది

డిన్నర్‌ డేట్‌కి ముగ్గురు బిలియనీర్లు .. ఫొటోలు వైరల్‌

రైల్వే టికెట్‌ బుకింగ్‌ విధానంలో మార్పులు

బ్లడ్‌ ఇవ్వండి.. ఓ కప్పు టీ తాగండి

Published on: Nov 04, 2025 10:19 PM