Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

| Edited By: Ravi Kiran

May 31, 2022 | 7:44 PM

ఛలో సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయ్యిన కన్నడ కన్నడ అమ్మాయి రష్మిక.. వరుస ఆఫర్లతో తక్కువ సమయంలోనే టాలీవుడ్లో బిజీ హీరోయిన్ గా మారిపోయారు. ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక..

YouTube video player
ఛలో సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయ్యిన కన్నడ కన్నడ అమ్మాయి రష్మిక.. వరుస ఆఫర్లతో తక్కువ సమయంలోనే టాలీవుడ్లో బిజీ హీరోయిన్ గా మారిపోయారు. ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక.. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్‏, కోలీవుడ్, కన్నడ ఇండస్ట్రీలలో వరుస ప్రాజెక్టులతో క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక తన అభిమాన హీరో గురించి చెప్పుకొచ్చారు. తన స్కూల్ డేస్ నుంచి దళపతి విజయ్ అంటే చాలా ఇష్టమట. భారీ స్టార్డమ్ ఉన్నప్పటికీ విజయ్ గారు చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయనలోని సింప్లిసిటీ నన్ను బాగా ఎట్రాక్ట్ చేసింది అంటూ తాజాగా ఓ ఇంట్రవ్యూలో చెప్పుకొచ్చారు రష్మిక. కాగా రష్మిక ఇప్పుడు దళపతి విజయ్ తో కలిసి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ డే షూటింగ్ కోసం ఆసక్తిగా వెయిట్ చేశా. ఆ రోజు క్లాప్ కొట్టిన తర్వాత విజయ్ గారికి దిష్టి తీసి ఆయన పట్ల నాకున్న అభిమానాన్ని చాటుకున్నా. దిష్టి తీయగానే విజయ్ గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సెట్లో ఉన్న వారంతా తెగ నవ్వేశారు’ అని చెప్పారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. భారీ బడ్జెట్ తో దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

Published on: May 31, 2022 09:29 AM