Raju Weds Rambai: రాజు వెడ్స్ రాంబాయి కలెక్షన్ల మోత.. కారణం అదేనా ??
రాజు వెడ్స్ రాంబాయి సినిమా విజయం టికెట్ ధరల తగ్గింపు, పైరసీ నివారణ ఫలితంగా వచ్చిందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. రూ.99 టికెట్లతో చిన్న సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. ఇది 'బటర్‌ఫ్లై ఎఫెక్ట్' అని, పెద్ద సినిమాలకూ ఇదే ఫార్ములా కలిసొస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అఖండ 2, ఇతర రాబోయే చిత్రాల మేకర్స్ ఈ వ్యూహాన్ని పరిశీలించే అవకాశం ఉంది.
బటర్‌ఫ్లై ఎఫెక్ట్ ని కళ్లారా చూస్తున్నామంటున్నారు సినిమా ప్రియులు. పైరసీ మీద అవగాహన పెరగడం ఎఫెక్టా? లేకుంటే, టిక్కెట్ ధరలు తగ్గుముఖం పట్టడం పుణ్యమా…విషయం ఏదైతే ఏంటి గానీ, ఓ చిన్న సినిమాకు కాసుల వర్షం కురుస్తోంది. మరి పెద్ద సినిమాలు ఈ చిన్న సినిమా రూట్లో ట్రావెల్ చేస్తాయా? ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి మన రాజు వెడ్స్ రాంబాయి మేకర్స్ కి తెలిసినట్టు అనే మాట్లాడుకుంటున్నారు జనాలు. సినిమా రిలీజ్‌కి ముందు డైరక్టర్ కాస్త ఆవేశంతో మాట్లాడారు గానీ, సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఆ మాటలు కాన్ఫిడెన్స్ తోనే అని అర్థమవుతుందంటున్నారు. సరిగ్గా ఈ సినిమా రిలీజ్ అయ్యే టైమ్‌కి పైరసీకి అడ్డుకట్ట పడటం, టిక్కెట్ రేట్ 99 రూపాయలు కావడం కంటెంట్‌కి కలిసొచ్చిందంటున్నారు ట్రేడ్ పండిట్స్. రాజు వెడ్స్ రాంబాయి మూవీకే కాదు, కాస్త తగ్గితే నెక్స్ట్ రిలీజ్‌కి రెడీ అవుతున్న సినిమాలకు కూడా కలిసొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. భారీ టిక్కెట్ హైక్‌లు అంటూ సామాన్యుల మీద భారం మోపకపోతే, థియేటర్లకు ఫుట్‌ఫాల్ పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. త్వరలోనే ప్యాన్ ఇండియా రిలీజ్‌కి రెడీ అవుతున్న అఖండ సీక్వెల్ కోసం కూడా జనాలు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకు పైరసీ కట్టుదిట్టం కావడం మంచి హెల్ప్ అవుతుంది. దానికి తోడు టిక్కెట్ల విషయంలో మేకర్స్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో.. దాని ప్రభావం కలెక్షన్ల మీద ఎలా ఉంటుందోననే టాక్స్ కూడా నడుస్తున్నాయి. అఖండ తరహా పెద్ద సినిమాలకే కాదు, అతి త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతున్న రివాల్వర్ రీటా, బైకర్, తేరే ఇష్క్ మే లాంటి సినిమాలు ఉన్న రేట్లతోనే మూవ్ అవుతారా? లేకుంటే టిక్కెట్ ప్రైజ్‌ని ఏమైనా తగ్గిస్తారా? అంటూ ఆరా తీయడం మొదలుపెట్టేశారు మూవీ లవర్స్. ఒకవేళ టిక్కెట్ ధరలను తగ్గించి, కలెక్షన్లు వీరలెవల్లో వస్తేగనుక, నియర్ ఫ్యూచర్‌లో రిలీజ్‌కి ఉన్న సినిమాలు పునరాలోచనలో పడే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ యాటిట్యూడ్‌ను మీ జేబులోనే పెట్టుకోండి.. క్యాబ్ డ్రైవర్ రూల్స్ వైరల్
ఆరు శతాబ్దాల మహావృక్షం చరిత్ర.. ఇది ఒక ఆధ్యాత్మిక అద్భుతం
ఫోన్‌లో మాటలు విన్నాడు.. మనసు గెలిచాడు
తిరుపతి మీదుగా దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు.. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లోనే చెన్నైకి