Coolie OTT: గుడ్ న్యూస్.. OTTలో కూలీ మూవీ..!

Updated on: Sep 06, 2025 | 12:06 PM

రజనీకాంత్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. టాలీవుడ్‌ నుంచి నాగార్జున, బాలీవుడ్‌ నుంచి ఆమిర్‌ ఖాన్‌, మాలీవుడ్‌ నుంచి సౌబిన్‌ షాహిర్‌, సాండల్‌వుడ్‌ నుంచి ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. అలాగే శ్రుతి హాసన్, రచితా రామ్, రెబామోనికాజన్, సత్యరాజ్ వివిధ పాత్రల్లో మెరిశారు. ఇక పూజా హెగ్డే మోనికా పాటతో ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది.

లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎన్నో అంచనాల మధ్యన ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని చోట్ల మిక్స్ డ్ టాక్ వచ్చినా ఓవరాల్ గా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు వచ్చేలా చేసుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. రజనీ మార్క్ యాక్షన్, నాగార్జున విలనిజం, షౌబిన్ షాహిర్, రచితా రామ్ ల పెర్ఫామెన్స్ , ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ ల కామియో రోల్స్ కూలీ సినిమా విజయంలో హైలెట్ గా నిలిచాయి. అలాగే అనిరుధ్ స్వరాలు, బీజీఎమ్ కూడా కూలీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన కూలీ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. కూలీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్… సెప్టెంబర్‌ 11 నుంచి కూలీ సినిమా ను స్ట్రీమింగ్ చేయనున్నట్టు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ మేరకు తమ సోషల్ మీడియా ఖాతాల్లో స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. అయితే హిందీ వెర్షన్ ఓటీటీ రిలీజ్‌ గురించి మాత్రం ఎటువంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. బహుశా కూలీ హిందీ వర్షన్‌ మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి రానుందేమో… చూడాలి!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అప్పు చేయనేలా.. ఇప్పుడు వైరల్ అవ్వడమేలా! స్టార్ కపుల్‌కు బిగ్ షాక్!

Pawan Kalyan: ఉపాధ్యాయ దినోత్సవం వేళ.. పిఠాపురం టీజర్లకు పవన్‌ బిగ్ సర్‌ప్రైజ్‌