Rajinikanth – Malineni Gopichand: డైరెక్టర్ మలినేని గోపీచంద్‌కు రజనీకాంత్ ఫోన్.. ‘వీరసింహారెడ్డి’ పై కామెంట్స్ చేసిన రజిని సార్..
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ మలినేని గోపిచంద్ కాంబినేషన్లో తెరకెక్కిన 'వీరసింహారెడ్డి' చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. బాలయ్య కెరీర్లో ఘన విజయం సాధించిన
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ మలినేని గోపిచంద్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. బాలయ్య కెరీర్లో ఘన విజయం సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. భారీ వసూళ్లను సాధించింది. మరోవైపు, బాలయ్య మాస్ అప్పీల్ కు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కించిన మలినేని గోపీచంద్ పై ప్రశంసలు జల్లు కురుస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ వీక్షించారు. అనంతరం మలినేనికి స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఈ విషయాన్ని మలినేని గోపీచంద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.’ఇది నాకు నమ్మలేని క్షణం. సూపర్ స్టార్, తలైవర్ రజనీకాంత్ సార్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన వీరసింహారెడ్డి సినిమాను చూశారు. ఆయనకు సినిమా ఎంతో నచ్చింది. సినిమాను ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన భావోద్వేగం ఈ ప్రపంచంలో నాకు అన్నింటి కంటే ఎక్కువ. థాంక్యూ రజనీ సార్’ అని ట్వీట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..