ఉన్న పొగ చాలు.. ఇంకా కొత్తవి ఎందుకు ?? బన్నీ- బ్రహ్మీ ట్రోల్స్‌ వాసు అసహనం

Updated on: May 06, 2025 | 4:48 PM

ఇటీవల అల్లు అర్జున్ ఓ వైట్ టీ షర్ట్ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు. ఆ టీ షర్ట్ మీద గాడ్ ఆఫ్ మీమ్ బ్రహ్మానందం ఫొటో ఉంది. అలాగే నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా అని కూడా రాసి ఉంది. ఈ టీషర్ట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలయ్యాయి. చాలా మందికి ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులకు ఈ టీషర్ట్ తెగ నచ్చేసింది.

అయితే కొంతమంది మాత్రం దీనిని నెగెటివ్ గా తీసుకున్నారు. బన్నీ టీ షర్ట్, ఓ రాజకీయ పార్టీకి ముడిపెడుతూ కామెంట్స్, పోస్టులు పెడుతున్నారు. అలాంటి వారికి స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు ప్రముఖ నిర్మాత బన్నీ వాస్. ప్రపంచం గర్వించదగ్గ బ్రహ్మానందం లాంటి ఒక హాస్య నటుడిపై బన్నీ తన అభిమానం చూపించడం కూడా తప్పైపోయిందా..? అంటూ తన అసహనం వ్యక్తం చేశారు బన్నీ వాసు. అంతేకాదు ఓ సీనియర్ ఫిల్మ్ రిపోర్టర్ బన్నీ టీషర్టును.. టీషర్టుపై ఉన్న ఫోటోను వక్రీకరించడాన్ని తప్పుబట్టారు. ఆయన వేసుకున్న టీ షర్టు మీద ఇలాంటి లాజిక్ అప్లై చేస్తారా..? అక్కడ తన అభిమాన హాస్యనటుడుపై బన్నీ ప్రేమ మీకు కనిపించలేదా..? మీ దృష్టిలో బ్రహ్మానందం బన్నీ గారు హైలైట్ చేసిన పాజిటివ్ కోణం మీకు కనబడలేదా? అంటూ ఆ రిపోర్టర్ తీరును ప్రశ్నించాడు బన్నీ వాసు. “వీలైతే గొడవలు ఆపుదాం.. మంచి విషయాలను పాజిటివ్ గా చెబుదాం అనేది లేదు. నాకు స్ఫూర్తినిచ్చిన మనిషి చిరంజీవి గారు అంటూ జాతీయ వేదికపై నిన్ననే బన్నీ గారు చాలా బాగా మాట్లాడారు. ఆ వీడియో మీ నాలెడ్జ్ లో రాలేదనుకుంటా.. అలాంటివి మీరు పట్టించుకోరు. అలాంటి వాటిని హైలెట్ చేస్తే మనసులో మాట కొంచెం పాజిటివ్ గా కనిపిస్తుంది. ఇటువంటివి రాస్తే కాస్త మంచి జరుగుతుంది. ఇప్పటికే ఉన్న పొగ చాలు.. ఇంకా కొత్తవి ఎందుకు సార్..?” అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు బన్నీ వాస్. అయితే ప్రస్తుతం ఈ టాలీవుడ్ నిర్మాత ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు.. ఇక చిప్ప కూడే గతి ??