Prithviraj Sukumaran: 2009లో మొదలై.. ఇప్పుడు రిలీజ్‌కు.. ఈ హీరోది మామూలుగా కష్టం కాదు.!
మలయాళ ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటుల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకరు. మలయాళ చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లోనూ నటిస్తూ దూసుకుపోతున్నారు. అంతేకాదు పాత్రలో పరకాయ ప్రవేశం చేసే ఈ టాలెంటెడ్ హీరో.. ప్రస్తుతం ఆడుజీవితం సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. రావడమే కాదు.. ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో తను ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో చెబుతూ..
మలయాళ ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటుల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకరు. మలయాళ చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లోనూ నటిస్తూ దూసుకుపోతున్నారు. అంతేకాదు పాత్రలో పరకాయ ప్రవేశం చేసే ఈ టాలెంటెడ్ హీరో.. ప్రస్తుతం ఆడుజీవితం సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. రావడమే కాదు.. ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో తను ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో చెబుతూ.. తన మాటలతో అందర్నీ షాకయ్యేలా చేస్తున్నాడు. అందరితో హ్యాట్సాఫ్ చెప్పించుకుంటున్నాడు. బ్లెస్సీ డైరెక్షన్లో పృథ్వీ రాజ్ హీరోగా నటిస్తున్న సినిమానే ఆడు జీవితం ది గోట్ లైఫ్. కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి కేరళ నుంచి సౌదీ అరేబియాకు పని పని కోసం వెళ్లి.. అక్కడ మోసపోయి.. అక్కడి నుంచి సాగించిన ప్రయాణమే ఈ సినిమా.! దాదాపు 2009లో బిగినింగ్‌లో మొదలైన ఈసినిమా 2018లో పూర్తైంది. ఆరేళ్ల తర్వాత అంటే ఇప్పుడు అంటే 2024 మార్చి 28న రిలీజ్‌కు రెడీ అయింది. అయితే ఈ సినిమా కోసం అప్పట్లో చాలా కష్టపడ్డా అంటూ.. ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పారు పృథ్వీ.
“ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూట్ చేస్తున్నప్పుడు 98 కిలోల బరువు పెరిగాను. మొదటి డెజర్ట్ షూట్ పూర్తయిన తర్వాత, నేను 31 కిలోల బరువు తగ్గాను. అప్పుడు నా శరీర బరువు 67 కిలోలు. నన్ను చూసి దర్శకుడు తో పాటు.. చిత్ర బృందం అంతా షాక్ అయ్యారు. ఈ సినిమాలో ఎడారిలో తప్పిపోయిన వ్యక్తి ఆకలితో ఎలా ఉంటాడో అలా కనిపించాలని నేను ప్రయత్నించా.. అందుకోసం తిండి మానేశా.. 72 గంటల పాటు కేవలం మంచినీళ్లు, కొద్దిగా బ్లాక్ కాఫీ మాత్రమే తాగేవాడిని” అని ఈ సినిమా కోసం తాను పడిన కష్టాన్ని అందరికీ వివరించారు ఈ హీరో.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

