ఇద్దరికీ అవగాహన శూన్యం.. ప్రకాష్‌రాజ్‌సంచలన కామెంట్స్‌

Edited By:

Updated on: Aug 06, 2025 | 4:23 PM

తమిళగ వెట్రి కళగం నేత విజయ్‌, జనసేన నేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌లను ఉద్దేశించి సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌ విమర్శలు గుప్పించారు. ఓ తమిళ పత్రికతో మాట్లాడిన ప్రకాష్‌ రాజ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌, విజయ్‌.. ఇద్దరికీ ప్రజా సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదని ప్రకాశ్‌ రాజ్‌ ఆరోపించారు. రాజకీయ జ్ఙానం శూన్యం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఇప్పుడా కామెంట్స్‌తో నెట్టింట వైరల్ అవుతున్నాడు ప్రకాశ్‌రాజ్‌. రాజకీయాలకు దూరంగా కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న ప్రకాశ్ రామ్ మళ్లీ రాజకీయంగా తన యాక్టివిటీని పెంచుతున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా చెన్నై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను కలిశారు. వారిని కలిసిన వెంటనే మీడియాతో మాట్లాడుతూ.. ఇటు పవన్‌ కళ్యాణ్‌పై.. అటు విజయ్‌ దళపతిపై షాకింగ్ కామెంట్స్‌ చేశారు. అంతేకాదు టాలీవుడ్‌ స్టార్‌ హీరో చిరంజీవి కుటుంబం నుంచి పవన్‌ రాజకీయాల్లోకి వచ్చారని, ఆ అభిమానులు మాత్రమే పార్టీ కార్యకర్తలుగా మారారని గుర్తు చేశారు. విజయ్‌ కూడా తమిళ్‌లో అగ్రహీరో ఆపై ప్రముఖ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ కుమారుడు కావడం కలిసొచ్చిందన్నారు. విజయ్‌, పవన్‌లతో తాను చాలా సినిమాల్లో నటించానని ఆ సమయంలో వారిద్దరిలో ఎవరూ కూడా రాజకీయాల గురించి అస్సలు మాట్లాడింది లేదన్నారు. పవన్‌ వచ్చి పది సంవత్సరాలు అయిందని ఆయనకు దీర్ఘదృష్టి కానీ, ప్రజా సమస్యలపై అవగాహన కానీ ఉన్నట్లు తాను ఎప్పుడూ గమనించలేదన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మా సినిమాల మీద బతుకుతూ.. మమ్మల్నే తిడతావా ?? ఛీ బుద్ది చూపించావ్ కదరా ??

అతి ప్రేమే కొంప ముంచింది !! తండ్రిగా నా భర్తకు బాధ్యత లేదు..

ప్రకృతిని చూద్దామని పోతే పసిడి పంట పండింది

నెల రోజులు రెగ్యులర్‌గా అల్లం తినండి.. జరిగింది చూసి మీరే షాకవుతారు

Published on: May 12, 2025 08:11 PM