ది రాజాసాబ్‌ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌..ఫ్యాన్స్‌ను అలర్ట్ చేసిన టీమ్‌ వీడియో

Updated on: Nov 23, 2025 | 11:17 AM

ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ది రాజా సాబ్ చిత్రం నుండి మొదటి సింగిల్ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. సంక్రాంతికి రానున్న ఈ హార్రర్ కామెడీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. నవంబర్ 23న ఈ పాట విడుదల కానుంది.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమాలో ప్రభాస్ కొత్త అవతారంలో కనిపించనున్నారు. చాలా రోజుల తర్వాత కామెడీని ప్రయత్నించడమే కాకుండా, మొదటిసారి హార్రర్ జానర్‌లో నటిస్తున్నారు. దర్శకుడు మారుతి రూపొందిస్తున్న ఈ హార్రర్ కామెడీ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.