ఒకప్పుడు వైజాగ్‌లో అరటి పండ్లు అమ్మాడు.. ఇప్పుడు 400 కోట్ల సినిమాతో సంచలనం

Updated on: Jun 10, 2025 | 4:40 PM

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో కెరీర్ ప్రారంభంలో ఎన్నో రకాల పనులు, ఉద్యోగాలు చేసిన వారే. అయితే వీరందరిలో ట్యాలెంటెడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మారుతీది వేరే కథ. డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక కూడా సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా పని చేశాడు ఈయన. తనకు కట్నంగా వచ్చిన డబ్బుతో అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమా కొన్నాడు.

డిస్ట్రిబ్యూటర్ గా మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మారుతీ.అలా జయ పజయాలతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తూ వెళ్లాడు. ఇప్పుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్‌కు వెళ్లిన ఈయన.. తను అరిటిపండ్లు అమ్ముకునే స్థాయి నుంచి 400 కోట్లతో ప్రభాస్‌తో సినిమా చేసే స్థాయికి వచ్చానంటూ చెప్పాడు. తన మాటతలో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉంటోన్న మారుతి తాజాగా మచిలీపట్నంలో నిర్వహిస్తున్న మసులా బీచ్‌ ఫెస్టివల్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘నేను 1999లో హైదరాబాద్‌కు వచ్చాను. అంతకుముందు వైజాగ్‌లో అరటిపండ్లు అమ్మేవాడిని. ఇక్కడ రాధికా థియేటర్‌ ఎదురుగా నాన్నకు అరటిపండ్ల బండి ఉండేది. నేను కూడా అక్కడ పండ్లు అమ్ముతుండే వాడినని చెప్పాడు. 1999లో హైదరాబాద్‌కు వచ్చానని.. అప్పుడు తనకు ఇక్కడ స్టిక్కరింగ్‌ షాపు ఉండేదన్నాడు. హిందూ కాలేజీలో చదువుకుంటూనే నెంబర్‌ ప్లేట్లు రెడీ చేసేవాడిని. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి కష్టపడితే ఎంత దూరమైనా వెళతాడన్న దానికి నేనేప్రత్యక్ష ఉదాహరణ. అక్కడెక్కడో మొదలై.. ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా రూ.400 కోట్ల బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీ తీస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు మారుతీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సమస్యే లేదు.. ఆమె లేనిది సినిమానే లేదు

‘ప్రేమే పొట్టన పెట్టుకుంది’ పాపం! హీరోయిన్‌ వెలుగొందాల్సింది.. శవమై కనిపించింది

నోటి దురుసు.. స్టార్ సింగర్‌ అయితే సరిపోదు.. సభ్యత ఉండాలి?

ప్రేమగా స్వీట్‌ పెడితే నిరాకరించిన వధువు.. వరుడు ఏం చేశాడో చూడండి