AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Athulya Ravi: హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!

Athulya Ravi: హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!

Anil kumar poka
|

Updated on: Jul 07, 2024 | 3:33 PM

Share

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అతుల్య రవి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఇక టాలీవుడ్‌లో ఈ బ్యూటీ చేసిన మీటర్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో తెలుగులో మరో ఆఫర్ అందుకోలేదు. ప్రస్తుతం అతుల్య రవి తన తల్లి విజయలక్ష్మితో కలిసి కోయంబత్తూరులోని వాడవల్లి మారుతం రోడ్డులో నివసిస్తోంది.

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అతుల్య రవి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఇక టాలీవుడ్‌లో ఈ బ్యూటీ చేసిన మీటర్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో తెలుగులో మరో ఆఫర్ అందుకోలేదు. ప్రస్తుతం అతుల్య రవి తన తల్లి విజయలక్ష్మితో కలిసి కోయంబత్తూరులోని వాడవల్లి మారుతం రోడ్డులో నివసిస్తోంది. తాజాగా ఈ హీరోయిన్ ఉంటున్న ఇంట్లో చోరీ జరిగినట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం ఈ హీరోయిన్ ఇంట్లో నుంచి ఆమె పాస్ పోర్టుతోపాటు 2000 రూపాయిలు కనిపించకుండా పోయాయట. దీంతో అతుల్య రవి తల్లి విజయలక్ష్మి వాడవల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఇంట్లో పనిచేసే పనిమనిషి చోరీకి పాల్పడినట్లు తెలిసింది.

తొండముత్తూరు పక్కనే ఉన్న కులత్తుపాలేనికి చెందిన మహిళ కొన్నాళ్లుగా అతుల్య రవి ఇంట్లో పనిచేస్తున్నారు. ఇంట్లో చోరీ జరిగినట్లు అతుల్య రవి తల్లి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు స్టార్ట్ చేసిన పోలీసులు పనిమనిషిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సదరు మహిళను విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. తన స్నేహితురాలు సెల్వి, సుభాషిణితో కలిసి హీరోయిన్ ఇంట్లో దొంగతనం చేశామని.. డబ్బు, పాస్ పోర్టు దొంగిలించినట్లు ఆ పనిమనిషి పోలీస్ విచారణలో చెప్పింది. దీంతో పనిమనిషితోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.