Ustaad Bhagat Singh: ఉస్తాద్ డేట్ లాక్.. మెగా ఫ్యాన్స్‌కు షాక్

Edited By:

Updated on: Jan 26, 2026 | 6:36 PM

"ఉస్తాద్ భగత్ సింగ్" రిలీజ్ డేట్‌పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. పవన్ కళ్యాణ్ నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ మార్చి 26న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తై చాలా కాలమైనా ప్రకటన ఆలస్యం కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. పవన్ స్టెప్పులు, డైలాగులతో ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. ఈ డేట్ పవన్ చిత్రానికి సమ్మర్ ఓపెనింగ్‌గా నిలిచి, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.

ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ఎప్పుడు..? ఈ సినిమా షూటింగ్ అయిపోయి చాలా రోజులైంది.. పవన్ కూడా తన పార్ట్ ఎప్పుడో పూర్తి చేసారు.. మరి అన్నీ సిద్ధంగానే ఉన్నా డేట్ ఎందుకు అనౌన్స్ చేయట్లేదు..? అభిమానులతో పాటు ఇండస్ట్రీలోనూ ఇదే అనుమానాలున్నాయిప్పుడు. వాటన్నింటికీ సమాధానమిస్తూ.. ఉస్తాద్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది. మామూలుగానే పవన్ సినిమాలపై ఉండే అంచనాలు వేరు.. OG తర్వాత అవి మరింత పెరిగాయి. మరీ ముఖ్యంగా ఉస్తాద్ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. పవన్ స్క్రీన్ మీద అలా కనిపిస్తేనే పండగ చేసుకుంటారు ఫ్యాన్స్.. అలాంటిది ఆయనిందులో డాన్స్ చేసారు.. దశాబ్ధం తర్వాత స్టెప్పులేసారు. దేఖ్‌లేంగే సాలా అంటూ స్వాగ్‌తో పిచ్చెక్కించారు DCM. ఇన్‌బిల్ట్ స్వాగ్‌తో డాన్సులే కాదు.. పవన్ డైలాగులు పేలిస్తే థియేటర్స్ ఊగిపోతాయేమో..? పైగా గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటం.. ఇప్పటికే షూటింగ్ పూర్తై 2 నెలలవుతుండటంతో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఎప్పుడనే చర్చ మొదలైంది. అన్నీ కుదిర్తే ఈసారి సమ్మర్ సీజన్ పవన్‌తోనే మొదలయ్యేలా ఉందిప్పుడు. ఉస్తాద్‌ భగత్ సింగ్‌ను మార్చి 26న విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఆ రోజే రావాల్సిన నాని ప్యారడైజ్, మరుసటి రోజు రావాల్సిన రామ్ చరణ్ పెద్ది.. రెండూ వాయిదా పడేలా ఉన్నాయి. అందుకే ఆ డేట్‌ను ఉస్తాద్ తీసుకుంటున్నారు. అన్నీ కుదిరి మార్చి 26న పవన్ సినిమా వస్తే.. సమ్మర్‌కు అదిరిపోయే ఓపెనింగ్ దొరికినట్లే. చూడాలిక.. ఏం జరగబోతుందో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జనవరి నుంచి సమ్మర్ వరకు.. క్రేజీ సినిమాల జాతర

పద్మశ్రీ రావడం సంతోషం మాత్రమే కాదు.. మరింత బాధ్యతనూ పెంచింది

గాంధీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. మహిళకు పునర్జన్మ

బాబోయ్‌ చిరుత.. పరుగులు తీస్తున్న రైతులు

‘ఆ అంకుల్స్ నాతో చండాలంగా ప్రవర్తించారు’ హీరోయిన్ ఎమోషనల్