Mark Shankar Pawanovich: పవన్ చిన్న కొడుకు.. హెల్త్ బులెటిన్ విడుదల

Updated on: Apr 09, 2025 | 5:34 PM

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్‌కు సింగపూర్‌లోని హాస్పిటల్‌లో చికిత్స కొనసాగుతోంది. ఐసీయూ నుంచి నార్మల్ వార్డ్‌కు మార్క్ శంకర్‌ను షిప్ట్ చేశారు..కాగా, అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులకు, కాళ్లకు గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చేరింది. దీంతో ప్రస్తుతం అతడికి సింగపూర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ తోపాటు మెగాస్టార్ చిరంజీవి, కొణిదెల సురేఖ సైతం సింగపూర్ చేరుకున్నారు. తాజాగా మార్క్ శంకర్ హెల్త్ గురించి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ టీమ్ అప్డేట్ వెల్లడించింది. ప్రస్తుతం మార్క్ కోలుకుంటున్నాడని.. ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడంతో వచ్చే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు. హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళిన పవన్ కల్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకుని.. మార్క్ ను చూశారు. చేతులు, కాళ్ళకు కాలిన గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. అక్కడి వైద్యులు, అధికారులతో మాట్లాడారు. మార్క్ కోలుకొంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని తెలియచేశారు. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చారు. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియచేశారు” అంటూ జనసేన పార్టీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వంటలక్కకు కోట్లకు కోట్లే..! దిమ్మతిరిగే రెమ్యునరేషన్‌

బలుపు ఎక్కువై.. నోటి దూలతో…! అలేఖ్య చిట్టిపై అన్వేష్ వీడియో..

BSNL యూజర్లకు గుడ్‌న్యూస్‌.. రూ.251తో సూపర్‌ ప్లాన్‌

దూరపు బంధువుతో రహస్యంగా పెళ్లి.. ఆ తర్వాత..!

పాపం చిరుతకు ఎక్కడ దాక్కువాలో తెలియక.. ఏకంగా అక్కడ దాక్కుంది