పాన్‌ ఇండియా కలలు కంటున్న యంగ్ జనరేషన్‌

Updated on: Oct 19, 2025 | 2:02 PM

ఒకప్పుడు స్టార్ హీరోలకు మాత్రమే పరిమితమైన పాన్‌ ఇండియా సినిమాలు ఇప్పుడు యువతరం హీరోలకూ విస్తరించాయి. కంటెంట్‌ బలంగా ఉంటే చిన్న చిత్రాలూ పెద్ద విజయం సాధిస్తాయని నిఖిల్ సిద్ధార్థ్ నిరూపించారు. సుధీర్ బాబు, తేజ సజ్జ, అడివి శేష్, వరుణ్ తేజ్ వంటి యువ హీరోలు పాన్‌ ఇండియా మార్కెట్‌పై దృష్టి సారిస్తున్నారు.

ఇంతకాలం టాప్ స్టార్స్‌, భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు మాత్రమే పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేసేవారు. అయితే, ప్రస్తుత పరిస్థితులు మారాయి. కంటెంట్ ప్రేక్షకులను కనెక్ట్ చేయగలిగితే చిన్న సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో బజ్ సృష్టిస్తున్నాయి. ఈ ట్రెండ్‌ను గుర్తించిన యువ తరం హీరోలు కూడా పాన్ ఇండియా కలలు కంటున్నారు. ఈ జాబితా ప్రస్తుతం భారీగానే కనిపిస్తోంది. యంగ్ హీరో సుధీర్ బాబు స్టార్ లీగ్‌లో ఇంకా పూర్తిస్థాయిలో ప్రూవ్ చేసుకోకపోయినా వరుసగా పాన్ ఇండియా ప్రయోగాలు చేస్తున్నారు. హరోం హర సినిమాతో ఇప్పటికే ఒక అటెంప్ట్ చేసిన సుధీర్, ఇప్పుడు జటాధర సినిమాతో మరోసారి పాన్ ఇండియా మార్కెట్లో తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెత్తిన కిరీటం పెట్టి మరీ కోటింగ్.. మాధురి పవర్ తీసేసిన నాగార్జున

TOP 9 ET News: దిమ్మతిరిగే న్యూస్.. పవన్‌ లోకేష్‌ కాంబినేషన్‌లో సినిమా..?

నిన్న దివ్య.. నేడు రీతూ.. ఒక్కొక్కరినీ ఉతికి ఆరేస్తున్న మాధురి! హౌసంతా హడల్‌

బంగారం కొంటున్నారా? నకిలీ గోల్డ్‌ని గుర్తించండిలా