Oscar Awards 2023 Live: మొదలైన ఆస్కార్ వేడుక.. గర్జించే పులిలా కనిపిస్తున్న ఎన్టీఆర్..(లైవ్)

|

Mar 13, 2023 | 12:06 PM

అట్టహాసంగా ప్రారంభమైన అస్కార్ అవార్డుల వేడుక. లాస్ ఏంజిల్స్‏లోని డాల్బీ థియేటర్‏లో అకాడమీ అవార్డ్స్ వేడుక జరుగుతోంది. ప్రపంచమంతా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూసే ఈ వేడుక భారత కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున ఘనంగా షూరు అయ్యింది.

అట్టహాసంగా ప్రారంభమైన అస్కార్ అవార్డుల వేడుక. లాస్ ఏంజిల్స్‏లోని డాల్బీ థియేటర్‏లో అకాడమీ అవార్డ్స్ వేడుక జరుగుతోంది. ప్రపంచమంతా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూసే ఈ వేడుక భారత కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున ఘనంగా షూరు అయ్యింది. నాటు నాటు ఊపుతో ఆస్కార్‌ అవార్డుల వేడుక ప్రారంభమైంది. వేదికపైకి వెళ్లే ముందు కూడా డ్యాన్స్‌ చేసి అలరించారు ఆస్కార్ యాంకర్స్‌. ఆ పాట తర్వాతే ఆవార్డ్‌ను వేదికపైకి తీసుకువచ్చారు ప్రెజెంటర్స్‌. లాస్‌ ఏంజెల్స్ నుంచి ఆస్కార్‌ వేడుకను లైవ్‌లో కళ్లకు గడుతున్న వన్‌ అండ్ ఓన్లీ తెలుగు ఛానల్‌ టీవీ9తెలుగు లైవ్ కవరేజ్. భాషాభేదాలకు అతీతంగా ప్రేక్షకులందరినీ కట్టిపడేసే సినీలోక సందడి.. ప్రపంచ ప్రసిద్ధ నటీనటులందరూ తమ జీవితంలో ఒక్కసారైనా సాధించాలనుకుని కలలు కనే పురస్కారం… అదే అద్వితీయ ఆస్కార్‌ సంబరం. 95వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూపు ఆస్కార్. ఆస్కార్ అవార్డు రేస్ లో మన తెలుగు చిత్రమైన ‘ఆర్​ఆర్​ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట పోటీపడుతుంది. ఇప్పటికే ఎన్నో మెట్లను దాటుకొని బరిలో నిలిచిన సాంగ్ ఇది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 13, 2023 06:14 AM