Devara: బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ విధ్వంసం.. ఎన్టీఆర్ అనుకున్నది సాధించారా.?

|

Oct 14, 2024 | 9:53 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. సెప్టెంబర్‌ 27న విడుదలైన ఈ మూవీ భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు ఊహించని స్తాయిలో రెస్పాన్స్ వస్తోంది. దసరా హాలిడేస్ కావడంతో ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ మూవీ రూ.500 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. సెప్టెంబర్‌ 27న విడుదలైన ఈ మూవీ భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు ఊహించని స్తాయిలో రెస్పాన్స్ వస్తోంది. దసరా హాలిడేస్ కావడంతో ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ మూవీ రూ.500 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. దేవర మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.405 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు 16 రోజుల్లో దేవర మూవీ వరల్డ్ వైడ్ రూ.500 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో తారక్ ఫ్యాన్స్ ఈ రికార్డును సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ నటించిన చిత్రం కావడంతో విడుదలకు ముందే దేవరపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. అంతేకాకుండా దాదాపు ఆరేళ్ల తర్వాత సోలోగా దేవర సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమా విడుదలకు ముందే రూ.500 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పుడు టార్గెట్ ఫినిష్ అయ్యిందని అంటున్నారు. దేవర థియేట్రికల్ బిజినెస్ రూ.180 కోట్లకు జరగ్గా.. ఈ సినిమా కనీసం రూ.400 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే హిట్టు అన్నారు. కానీ ఇప్పుడు ఈ మూవీ రూ. 500 కోట్లు గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. ఇప్పటికే దేవర సక్సెస్ పార్టీ జరగ్గా.. ఎన్టీఆర్ సోలో హీరోగా రూ.500 కోట్లు రాబట్టడం ఇదే మొదటిసారి. దీంతో ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. దేవర సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మరో సినిమా చేయనున్నాడు తారక్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.