AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‌ బాస్‌లో ఉన్న సంజనకు బిగ్ ఝలక్! వెంటాడుతోన్న డ్రగ్ కేసు.. సుప్రీం నోటీస్‌!

బిగ్‌ బాస్‌లో ఉన్న సంజనకు బిగ్ ఝలక్! వెంటాడుతోన్న డ్రగ్ కేసు.. సుప్రీం నోటీస్‌!

Phani CH
|

Updated on: Sep 28, 2025 | 6:20 PM

Share

టాలీవుడ్ హీరోయిన్ సంజనా గల్రానీ ప్రస్తుతం బిగ్‌బాస్‌ సీజన్ 9లో హంగామా చేస్తోంది. తన గేమ్‌తో కంటెస్టెంట్స్‌కు గట్టి పోటీ ఇస్తోంది. ఈ క్రమంలోనే జనాలకు కూడా నచ్చేస్తోంది. వారి నుంచి లవబుల్ రెస్పాన్స్ కూడా రాబట్టుకుంటోంది. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. తాజాగా సంజనాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 26న కోరింది. డ్రగ్స్ కేసులో ఆమెకు ఈ నోటీసులు జారీ చేసింది. ఇక 2020లో కన్నడ పరిశ్రమను ఈ డ్రగ్స్ కేసు కుదిపేసింది. ఆ మసయంలో సినీనటి రాగిణి ద్వివేదితోపాటు సంజనాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 14వ నిందితురాలిగా ఆమె పేరును చేర్చారు. సుమారు రెండు నెలల తర్వాత బెయిల్ దొరకడంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. సంజనాపై కొకైన్, MDMA, LSD వంటి మత్త పదార్థాలను వినియోగించడంతోపాటు, పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 2024 మార్చి 25న కర్ణాటక హైకోర్టు ఈ కేసును సాంకేతిక కారణాలతో రద్దు చేసింది. కోర్టు అభిప్రాయం ప్రకారం సెక్షన్ 219 సీఆర్పీసీ ప్రకారం 12 నెలల వ్యవధిలో మూడు కంటే ఎక్కువ నేరాలపై ఒకే ట్రయల్ లో జరపలేమని పేర్కొంది. దీంతో ఈ కేసులో ఆమెకు ఉపశమనం కలిగింది. కానీ కర్ణాటక ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే సంజనాకు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్ట్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కన్న కొనడుకుపై తండ్రి షాకింగ్ కామెంట్స్ పాపం! ఆ పెద్దాయన పరిస్థితి.. ఎవరికీ రాకూడదు

బిగ్ బాస్ దిమ్మతిరిగే చక్రవ్యూహం.. దెబ్బకు గుక్కపెట్టి మరీ ఏడ్చిన ఇమ్మాన్యుయేల్

కొడుకు సిరీస్‌ వల్ల.. షారుఖ్‌కు 2 కోట్ల కష్టం

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. అబార్షన్ !! అబద్ధం చెప్తే కుక్కచావు చస్తా …

బిగ్ బాస్ వైల్డ్‌ డెసీషన్‌కి బిత్తర పోయిన కటెంస్టెంట్స్