AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. అబార్షన్ !! అబద్ధం చెప్తే కుక్కచావు చస్తా ...

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. అబార్షన్ !! అబద్ధం చెప్తే కుక్కచావు చస్తా …

Phani CH
|

Updated on: Sep 28, 2025 | 5:48 PM

Share

ధర్మ మహేష్..! సినిమాల్లో హీరోగా ఎదగాల్సిన ఇతను.. తన పర్సనల్ విషయాల కారణంగా పాపులర్ అయ్యాడు. తన భార్య గౌతమి చౌదరి చేసిన ఆరోపణలతో.. రీతూ చౌదరితో తను కలిసున్న సీసీ ఫుటేజ్ వీడియోలతో.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. అయితే ఈక్రమంలోనే తనపై వస్తున్న విమర్శలకు ఓ షోలో జవాబిచ్చాడు.

తన భార్యపై కూడా తీవ్ర ఆరోపణలు చేశాడు. తన భార్య ఫోన్ నెంబర్‌ తనకే తెలియదని చెబుతూనే.. గతంలో గౌతమి తన ప్రెగ్నెన్సీ తీసుకున్న విషయాన్ని బటయపెట్టాడు ధర్మ. గౌతమి ఫోన్‌లోని సెకండ్‌ నెంబర్‌ ఏంటో కూడా నాకు తెలీదు. అడిగితే.. నీ ప్రైవసీ నీది, నా ప్రైవసీ నాది అంటూ చెప్పేదన్నాడు ధర్మ. మొగుడ్ని.. తనకే నెంబర్‌ చెప్పదు. రాత్రి వేరే ఎవడి కారులోనో బర్త్‌డే పార్టీకి వెళ్లొస్తుంది. బాగా తాగి తన ఫోటోను కూడా కాల్చేసింది. ఇవన్నీ తానెలా తట్టుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు దర్మ. తామిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పెళ్లికి ముందు గుంటూరులో ఒకే గదిలో కలిసున్నాం. ఆ సమయంలో అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు తనకింకా 19 ఏళ్లే!.. అయినా సరే తాను నిలబడతాను, ప్రెగ్నెన్సీ ఉంచుకోమన్నా.. కానీ తను ఒప్పుకోలేదు. పరువు పోతుందని అబార్షన్‌ చేయించుకుందంటూ అప్పటి సంఘటనను వివరించాడు ధర్మ. అంతేకాదు తాను మే నెలవరకు కలిసుందామనే ప్రయత్నించానని.. గౌతమితో తప్ప ఎవరితోనూ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవలేదని ధర్మ చెప్పాడు. తన కొడుకును చూపించమంటే లెక్కచేయడం లేదని.. మే తర్వాత నుంచి తన కొడుకును ఇంతవరకు గౌతమి చూపించలేదంటూ ఆరోపించాడు. తనకు డ్రగ్స్ అలవాటు లేదని..తానేం డబ్బు కోసం గౌతమిని వేదించలేదంటూ చెప్పాడు. అదే షోలో.. తాను అబద్ధం చెప్తే కుక్కచావు చస్తానంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశాడు ధర్మ మహేశ్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిగ్ బాస్ వైల్డ్‌ డెసీషన్‌కి బిత్తర పోయిన కటెంస్టెంట్స్

ఇక ఏ సినిమా టికెట్ ధరల పెంపు ఉండదా..?

సైయార స్టార్స్‌కు క్రేజీ ఆఫర్స్‌.. దశ తిరిగినట్లేనా

వర్కింగ్ డేస్ విషయంలో ఖిలాడీ ఫార్ములా.. అక్షయ్‌ ఎలా ప్లాన్ చేస్తున్నారు

Salman Khan: కండలవీరుడు సల్మాన్‌ను ఇబ్బంది పెడుతున్న వరుస సమస్యలు.. అవేనట