Coolie: కూలీ సినిమాపై లోకి ప్రయోగం !! మరో కబాలి కాదు కదా ??

Updated on: Jul 12, 2025 | 12:58 PM

ఓ సినిమాకు హైప్‌ పెంచాలంటే.. ముందు పవర్ ఫుల్ టీజర్‌ను వదలాలి. ఆ తర్వాత రిలీజ్‌కు కొన్ని రోజుల ముందు.. దిమ్మతిరిగే కట్‌తో ఓ ట్రైలర్‌ రిలీజ్ చేయాలి. ఈ రెండింటి తోనే తమ సినిమాపై మాగ్జిమమ్.. ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచేసి... జనాలను థియేటర్స్‌కి రప్పించేలా చేయాలి. ఇది ఎప్పటి నుంచో డైరెక్టర్స్ అందరూ ఫాలో అవుతున్న రూల్.

కానీ ఈ రూల్‌ను బ్రేక్‌ చేస్తూ.. అనిల్ రావిపూడి వంటి డైరెక్టర్లు.. అనౌన్స్‌మెంట్ నుంచే ఏదో ఒక అప్డేట్‌నో.. లేదా ఏదో ఒక వీడియో గ్లింప్స్‌నో వదులుతుంటారు. తమ సినిమాపై ముందు నుంచే హైప్ క్రియేట్ చేస్తుంటారు. నిన్న మొన్నటి వరకు లోకేష్ కూడా ఇలాగే చేశాడు. కానీ ఇప్పుడు ఏకంగా మరో అడుగు ముందుకేసి.. తన ప్రమోషన్ స్ట్రాటజీనే మార్చేశాడు ఈ డైరెక్టర్. కూలీ సినిమా ముందు వరకు తన సినిమాల ప్రమోషన్స్‌ కోసం టీజర్‌ , ట్రైలర్‌ ఫార్మాట్‌నే నమ్ముకున్న లోకి.. ఇప్పుడు ఆ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాడట. ఓ సినిమా పై అనుకున్నంత ఎక్స్‌పెక్టేషన్స్‌ వచ్చినప్పుడు.. సూపర్భ్‌ బిజినెస్‌ జరిగినప్పుడు… టీజర్ ట్రైలర్‌ ఎందుకని చెబుతున్నాడట. వాటిని రిలీజ్ చేసి.. సినిమాను రిలీజ్ చేస్తే సరిపోతుందని ఆలోచిస్తున్నాడట. ఇక తన ఆలోచనకు అనుగుణంగానే… తన కూలీ సినిమాను ఆగస్టు 14న విత్ అవుట్ టీజర్ అండ్ ట్రైలర్‌తో థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు డిసైడ్ అయ్యాడట లోకి. ఇక కూలీ సినిమా అనౌన్స్‌ మెంట్‌కే ట్రైలర్‌ రేంజ్‌ వీడియో గ్లింప్స్‌ను వదిలాడు లోకి. ఆ గ్లింప్స్‌తోనే కూలీని క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్‌ గా మార్చేశాడు. ఇక ఆ తర్వాత.. తన సినిమాలో యాక్ట్ చేస్తున్న స్టార్స్‌ క్యారెక్టర్ నేమ్‌ను.. వారి లుక్‌ను రిలీజ్‌ చేస్తూ… కూలీ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను హైగా.. మెయిన్ టేన్ చేస్తూ వస్తున్నాడు. ఇక రీసెంట్‌గా అనిరుధ్‌ కంపోజింగ్‌లో రిలీజ్‌ అయిన పవర్‌ హౌస్‌ వైబ్, చికిటు సాంగ్‌ సూపర్ హిట్ అయింది. అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫాంలలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా పై అప్పటికే ఉన్న హైప్‌ను కూడా ఈ సాంగ్స్‌ నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.1000 కోట్ల హీరోయిన్.. ఆస్తి పాస్తులకు లెక్కే లేదు.. డబ్బుపై విరక్తి కాబోలు.. అందుకే చిన్న కార్‌లో అలా..

అభిషేక్ బచ్చన్ బ్యాడ్ లక్‌ !! కెరీర్‌ను నిలబెట్టే ఛాన్స్‌ మిస్..

ప్రభాస్, షారుఖ్ రికార్డ్స్ బద్దలుకొట్టిన.. కుర్ర హీరో..

దానిమ్మ, స్ట్రాబెర్రీతో అద్భుత ఆరోగ్యం..!

సెకనుకు రూ.10 లక్షలు.. ప్రైవేట్ జెట్.. ఈ హీరోయిన్ రేంజే వేరు