వారసులు వస్తున్నారు.. లైట్ తీసుకుంటే అంతే సంగతులు
టాలీవుడ్‌లోకి కొత్త తరం హీరోలు అడుగుపెడుతున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్, సుమ కుమారుడు రోషన్ కనకాల రీ-లాంచ్‌లకు సిద్ధమవుతుండగా, రమేష్ బాబు తనయుడు జైకృష్ణ, నందమూరి జనకిరామ్ తనయుడు ఎన్టీఆర్ డెబ్యూ చేస్తున్నారు. ఈ వారసులు ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి. వారి అప్‌కమింగ్ చిత్రాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వారసులు వచ్చేస్తున్నారు.. చాలా రోజుల తర్వాత తెలుగులో కొత్త హీరోల రాక కనిపిస్తుంది. కొందరు ఇప్పటికే ఒకట్రెండు సినిమాలు చేసినా.. రీ లాంఛ్ అంటూ తమను తామే మళ్లీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేసుకునే పనిలో పడ్డారు. మరికొందరేమో డెబ్యూ చేస్తున్నారు. మరి వీళ్లెవరు.. వాళ్లెవరు..? ఇంతకీ ఆ వారసులెవరు..? పదేళ్ళ కింద నిర్వలా కాన్వెంట్ సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యారు శ్రీకాంత్ తనయుడు రోషన్. కానీ అప్పుడింకా చిన్న పిల్లాడే కావడంతో.. నాలుగేళ్ల కింద పెళ్లి సందడితో రీ లాంఛ్ అయ్యారు. రాఘవేంద్రరావు స్కూల్ నుంచి వచ్చిన ఈ చిత్రం హిట్టైనా.. రోషన్ కంటే శ్రీలీలకే ఎక్కువ క్రేజ్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె రేంజ్ ఏంటో చెప్పనక్కర్లేదు. పెళ్లి సందడి తర్వాత శ్రీలీల కనీసం 12 సినిమాలకు పైగానే నటించారు. కానీ రోషన్ మాత్రం మరో సినిమా చేయలేదు. ఈయన ఫోకస్ అంతా ఇప్పుడు ఛాంపియన్ సినిమాపైనే ఉంది. వైజయంతి నుంచి వస్తున్న ఈ చిత్రమే తనకు రీ లాంఛ్ అంటున్నారు రోషన్. ప్రదీప్ అద్వైతం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్. రోషన్ మేక మాదిరే మరో రోషన్ కూడా తనదైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. బబూల్ గమ్ సినిమాతో పరిచయమైన సుమ కొడుకు రోషన్ కనకాల.. మొదటి సినిమాతో హిట్ కొట్టలేకపోయారు. ప్రస్తుతం మనోడి దృష్టంతా మోగ్లీ సినిమాపైనే ఉంది. పీపుల్ మీడియా నుంచి వస్తున్న ఈ సినిమాకు సందీప్ రాజ్ దర్శకుడు. డిసెంబర్ 25 ఛాంపియన్ వస్తుంటే.. రెండు వారాల ముందే అంటే 12న మోగ్లీ రానుంది. ఇద్దరు రోషన్‌లకు ఇది రెండో సినిమానే.. కానీ ఘట్టమనేని కుటుంబం నుంచి దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. అజయ్ భూపతి తెరకెక్కించబోయే ఈ చిత్రంలో రవీనా టాండన్ కూతురు ఇషా తడాని హీరోయిన్. ఇక వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో నందమూరి జనకిరామ్ తనయుడు ఎన్టీఆర్ హీరోగా పరిచయం అవుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చనిపోయిన తల్లిలా వేషం వేసిన కొడుకు.. మూడేళ్లుగా రూ. 80 లక్షల పింఛను కోసం నాటకం
Hongkong: అపార్ట్‌మెంట్లలో అగ్నికీలలు పన్నెండు మంది మృతి.. లోపలే చిక్కుకున్న వందలాది మంది
చెవిపోగులు తాకట్టు పెట్టింది.. కట్ చేస్తే కటిక పేదరికం నుండి పెద్ద ధనవంతురాలు అయ్యింది