Naresh – Pavitra: నరేష్‌ ఎక్స్‌ వైఫ్‌ ధాటికి.. వెనకడుకు వేసిన ప్రైమ్.! మళ్లీ పెళ్లిస్టాప్..!

|

Jun 25, 2023 | 9:43 AM

మళ్లీ పెళ్లి! ఈ సినిమా రిలీజ్‌కు ముందు.. రిలీజ్‌ అయిన తర్వాత మాత్రమే కాదు.. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‌లోనూ వివాదాస్పదంగా మారింది. నరేష్‌ పవిత్రల లవ్‌ స్టోరీ.. ఏకంగా ప్రెస్టీజియస్‌ ఓటీటీ జెయింట్ అమేజాన్‌ ప్రైమ్‌నే వెనకడుగు వేసేలా చేసింది.

మళ్లీ పెళ్లి! ఈ సినిమా రిలీజ్‌కు ముందు.. రిలీజ్‌ అయిన తర్వాత మాత్రమే కాదు.. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‌లోనూ వివాదాస్పదంగా మారింది. నరేష్‌ పవిత్రల లవ్‌ స్టోరీ.. ఏకంగా ప్రెస్టీజియస్‌ ఓటీటీ జెయింట్ అమేజాన్‌ ప్రైమ్‌నే వెనకడుగు వేసేలా చేసింది. ఇప్పుడిదే అటు తెలుగు టూ స్టేట్స్‌లోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ.. తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! ప్టార్ ప్రొడ్యూస్‌ ఎమ్ ఎస్‌ రాజు డైరెక్షన్లో.. నరేష్ ఓన్ ప్రొడక్షన్లో.. తెరకెక్కిన సినిమానే మళ్లీ పెళ్లి. సీనియర్ యాక్టర్ నరేష్‌… తను ప్రేమించిన పవిత్ర.. వీరిద్దరి మధ్యలో వచ్చిన నరేష్ ఎక్స్‌ వైఫ్‌ రమ్య రఘుపతి మధ్య సాగిన రిలైఫ్ సీన్ల ఆధారంగా తెరకెక్కిందే ఈ సినిమా.! అయితే ఈ సినిమా రిలీజ్‌కు ఒక్క రోజు ముందే… నరేష్ ఎక్స్‌ వైఫ్‌ రమ్య రఘుపతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన ప్రమేయం లేకుండా తన క్యారెక్టర్‌ను సినిమాలో తప్పుగా చూపించారని.. వక్రీకరించారని మీడియా ముందు మొరపెట్టుకున్నారు. కోర్టుకెళ్లి సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ తన ప్రయత్నంలో ఫెయిల్ అయ్యారు. కల్పిత పాత్రలతో.. తెరకెక్కిన సినిమానే మళ్లీ పెళ్లి అని పదే పదే చెప్పడంలో నరేష్ సక్సెస్‌ అయ్యారు. మొత్తానికి తన సినిమాను రిలీజ్‌ చేసుకొని.. కలెక్షన్స్‌ పరంగా సూపర్ డూపర్ హిట్ కూడా కొట్టారు. ఇక ఈ క్రమంలోనే ఈ కాంట్రవర్సియల్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కి రెడీ అవడంతో.. మరో సారి రంగంలోకి దిగారు.. నరేష్ ఎక్స్‌ వైఫ్‌ రమ్య రఘుపతి. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఆపేయాలని.. తాజాగా ప్రైమ్‌కు నోటీసులు పంపారు. అంతేకాదు సినిమా అనే కళారూపాన్ని వాడుకుని.. తన పరువు తీసేందుకే ఈ సినిమాను తెరకెక్కించారని.. మరో సారి మేకర్స్ మీద ఆ నోటీసులో ఆరోపణలు చేశారు. ఈ సినిమా వల్ల తన గౌరవం దెబ్బతింటుందంటూ అందులో కోట్ చేశారు. ఇక ఈ నోటిసులు అందుకున్న అమెజాన్ ప్రైమ్ జూన్ 23న స్ట్రీమ్‌ కావాల్సిన ఈ సినిమాను ప్రస్తుతానికైతే నిలిపేసినట్టు తెలుస్తోంది. మరి ఆ తర్వాత నరేష్ ఎక్స్ వైఫ్ రమ్య పంపిన నోటీసులను పక్కకు పెట్టి.. స్ట్రీమింగ్‌ చేస్తుందా లేదా అనేది మాత్రం ఇప్పుటికైతే సస్పెన్స్‌గానే ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!