చై – శోభితల మనసు బంగారం.. ఎంత మంచి పని చేశారో

Updated on: Feb 23, 2025 | 9:46 PM

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో నాగచైతన్య, శోభిత దూళిపాల జంట కూడా ఒకటి. గతేడాది పెళ్ళితో ఒకటయ్యారు. హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. తమ సినిమా జర్నీలో సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ దంపతులు తమ గొప్ప మనసును చాటుకున్నారు. కాన్సర్ తో పోరాడుతున్న పిల్లలను కలిసి వారితో కాసేపు టైం స్పెండ్ చేశారు. బహుమతులిచ్చారు.

హైదరాబాద్ లోని సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్ క్యాన్సర్ చికిత్స కోసం వచ్చే పిల్లలకు, వారి కుటుంబాలకు ఉచిత ఆశ్రయం కల్పిస్తుంది. ఈ క్రమంలోనే నాగచైతన్య, శోభిత దంపతులు ఈ కేర్ సెంటర్ ని విజిట్ చేశారు. నాగచైతన్య అయితే అక్కడి పిల్లలతో బాగా కలిసిపోయారు. కలిసి సరదాగా ఆడిపాడారు. వారితో కలిసి సరదాగా డాన్స్ కూడా చేశారు. అడిగిన వారందరికీ సెల్ఫీలు, ఫోటోలు ఇచ్చారు. ఇక శోభిత కూడా పిల్లలతో కబుర్లు చెబుతూ వారి కళ్ళలో ఆనందాన్ని నింపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన వారందరూ నాగచైతన్య, శోభితలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Manchu Lakshmi: భర్తతో దూరంగా ఉంటున్నారు ఎందుకు? మంచు లక్ష్మీ షాకింగ్ ఆన్సర్

సెల్ఫీ పేరుతో ముద్దుకు ప్రయత్నం! హీరోయిన్‌కు చేదు అనుభవం

‘జీవితంలో దొరికిన గొప్ప గిఫ్ట్’ పవన్‌తో స్నేహం పై ఆనంద్ సాయి ఎమోషనల్

Prudhvi Raj: ట్విట్టర్ ఖాతా తెరిచిన పృథ్వీ! అప్పుడే మళ్లీ రచ్చ షురూ…

ఊరికే పనిచేస్తా.. ఉద్యోగం ఇవ్వండి ప్లీజ్‌.. ఓ టెక్కీ ఆవేదన