కన్నప్ప అట్టర్ ఫ్లాప్ అంటూ ట్రోలింగ్.. మోహన్ బాబు రియాక్షన్
మోహన్ బాబు తన స్టైల్ కు భిన్నంగా ఈసారి రియాక్టయ్యారు. కన్నప్ప పై విమర్శలు చేస్తున్న వారిని కోపగించుకోకుండా.. వారు క్షేమంగా ఉండాలంటూ కోరకున్నారు. దానికి ఓ పండితుడు చెప్పిన మాటలను కోట్ చేసి.. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు మోహన్ బాబు. గతంలో మంచు విష్ణు సినిమా రిలీజ్ అయితే చాలు. విపరీతమైన ట్రోల్స్ వచ్చేవి.
సినిమా ఫ్లాప్ అంటూ కుప్పలు తెప్పలుగా రివ్యూలొచ్చేవి. దీంతో రంగంలోకి దిగిన మంచు విష్ణు పరిస్థితిని చక్కదిద్దాడు. తన సినిమాలపై అడ్డదిడ్డంగా రివ్యూలిచ్చే వారిపై ఫైర్ అయ్యాడు. ట్రోలర్స్ ఛానెల్స్‌ను మూతపడేలా చేశాడు. ఇంకో పక్క మీమర్స్ మీట్ పెట్టి.. తన సినిమాను ప్రమోట్ చేయించుకునేలా ప్లాన్ చేశాడు. దీంతో కన్నప్ప సినిమా.. వీరందరి ముప్పేట దాడి నుంచి బయటపడింది. ఇక సినిమా రిలీజ్ తర్వాత.. బాగుందనే టాక్ బయటికి రావడంతో.. విష్ణు, మోహన్ బాబు నుంచి కూడా హ్యాపీ రియాక్షన్ వచ్చింది. కానీ ఎటొచ్చి.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో అనుకున్న టార్గెట్కు రీచ్ కాలేదని ఓ కొత్త టాక్ బయటికి వచ్చింది. ఇక ఇదే టాక్ ఇటీవల సోషల్ మీడియాకెక్కింది. కలెక్షన్స్ పరంగా కన్నప్ప ఫ్లాప్ అంటూ కొంత మంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అందుకే కన్నప్ప మేకర్స్ కలెక్షన్స్ లెక్కలు చెప్పడం లేదంటూ తమ పోస్టులో కోట్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే కన్నప్ప మూవీ ప్రొడ్యూసర్ మంచు మోహన్ బాబు రియాక్టయ్యారు. కొందరు అదేపనిగా కన్నప్ప సినిమాపై విమర్శలు చేయడంపై.. మోహన్ బాబు .. ఊహకు అందని రీతిలో స్పందించారు. విమర్శ – సద్విమర్శ, ప్రకృతి- వికృతి.. ఇలా రెండూ ఉంటాయన్నారు. కనుక తమ సినిమాను విమర్శించినంత మాత్రాన పోయేదేమీ లేదన్నట్టు మాట్లాడారు. అంతేకాదు ఓ గొప్ప పండితుడు చెప్పిన మాటలను గుర్తు చేశారు మోహన్ బాబు. గత జన్మలో లేదా ఈ జన్మలో తెలిసీతెలియక మీరేదైనా తప్పులు చేసుంటే ఇలా విమర్శించేవారంతా మీ కర్మను తీసుకెళ్తున్నారని అర్థం. కాబట్టి వారిని ఆశీర్వదించండి అన్నారు. వారి గురించి తానేం మాట్లాడనని.. వాళ్లు, వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పారు మోహన్ బాబు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూడో బిడ్డను కనండి.. రూ.12 లక్షల రివార్డు అందుకోండి
కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!
గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు