Komatireddy Venkat Reddy: చిరుకు ‘భారత రత్న’ రావాలి.! మంత్రి మాటలు వైరల్..

Updated on: Jan 27, 2024 | 11:50 AM

చిరుకు భారత దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ వచ్చిన వేళ... పొలిటికల్ అండ్ సెలబ్రిటీస్.. అయన ఇంటికి చేరుకుంటున్నారు. ఆయన్ను కలిసి పర్సనల్గా విష్‌ చేస్తున్నారు. సన్మానిస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి కూడి ఇదే చేశారు. చిరును సన్మానించడమే కాదు.. క్రేజీ కామెంట్స్ కూడా చేసి.. నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నారు ఈ మంత్రి.

చిరుకు భారత దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ వచ్చిన వేళ… పొలిటికల్ అండ్ సెలబ్రిటీస్.. అయన ఇంటికి చేరుకుంటున్నారు. ఆయన్ను కలిసి పర్సనల్గా విష్‌ చేస్తున్నారు. సన్మానిస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి కూడి ఇదే చేశారు. చిరును సన్మానించడమే కాదు.. క్రేజీ కామెంట్స్ కూడా చేసి.. నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నారు ఈ మంత్రి. చిరంజీవికి పద్మవిభూషణ్‌ అవార్డు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు కోమటి రెడ్డి వెంకట రెడ్డి. చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు రావడం తెలంగాణకు ఆయన గర్వకారమన్నారు. త్వరలో చిరంజీవికి పౌరసన్మానం కూడా చేస్తామన్నారు. చిరుకు పద్మ విభూషణ్ మాత్రమే కాదు.. భవిష్యత్తులో భారత రత్న కూడా రావాలంటూ.. ఆకాంక్షించారు. చిరు కూడా.. మంత్రి చేసిన చిరు సన్మానాన్ని హ్యాపీగా ఫీలయ్యారు. అయితే ఈ చిరు ఈవెంట్లో.. కోమటిరెడ్డితో పాటు టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్‌ దిల్ రాజు కూడా కనిపించడం…నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos