Mana Shankara Vara Prasad Garu: మన శంకరవరప్రసాద్ గారు.. రప్ఫాడించేసారు..

Updated on: Jan 29, 2026 | 9:45 AM

మామూలుగానే "బాస్ ఆఫ్ రికార్డ్స్" అని పిలువబడే చిరంజీవి, తన తాజా చిత్రంతో ఈ బిరుదును మరోసారి నిజం చేసుకున్నారు. కేవలం 15 రోజుల్లో రూ.170 కోట్ల షేర్, రూ.350 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఎన్నో ఆల్-టైమ్ రికార్డులు సృష్టించింది. 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, బుక్ మై షో, నార్త్ అమెరికాలో అద్భుత ప్రదర్శనతో టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన రీజినల్ చిత్రంగా నిలిచింది.

మామూలుగానే చిరంజీవిని బాస్ ఆఫ్ రికార్డ్స్ అంటుంటారు.. అలా తనను ఎందుకు పిలుస్తారో సరదాగా మరోసారి మరోసారి నిరూపించారు మన శంకరవరప్రసాద్ గారు. ఈ మధ్య కాలంలో ఏ రీజినల్ సినిమాకు సాధ్యం కాని రికార్డులకు తెరతీసింది బాస్ బొమ్మ. 15 రోజుల్లో ఎన్నో ఆల్ టైమ్ రికార్డులు సెట్ చేసింది. మరి అవన్నీ ఓసారి అలా చూసేద్దామా..? అనౌన్స్‌మెంట్ నుంచే శంకరవరప్రసాద్ అద్భుతాలు మొదలయ్యాయి.. చకచకా షూటింగ్ పూర్తి కావడం.. అనుకున్నట్లుగానే పండక్కి రప్ఫాడించడం.. అన్నీ అలా కమ్ అండ్ గో..లా జరిగిపోయాయి. తోడుగా అనిల్ రావిపూడి ఉండటంతో ప్రీమియర్స్‌ నుంచే తన బ్యాటింగ్ షురూ చేసారు మెగాస్టార్. 1.5 మిలియన్ డాలర్లతో సీనియర్లలో కొత్త రికార్డు సెట్ చేసారు చిరంజీవి. మొదటి రోజు నుంచే రికార్డుల వేట మొదలెట్టిన బాస్.. ఆ తర్వాత అస్సలు ఆగలేదు. బుక్ మై షోలో 3.6 టికెట్ బుకింగ్స్‌తో మరే రీజినల్ సినిమాకు సాధ్యం కాని రికార్డు సెట్ చేసారు. సంక్రాంతికి వస్తున్నాం 3.5 మిలియన్స్ టికెట్స్ బుక్ అయితే.. ఆ రికార్డ్‌ను చిరు దాటేసారు. దానికి ముందు అల వైకుంఠపురములో సినిమా రికార్డును సంక్రాంతికి వస్తున్నాం దాటేసింది. 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి.. అన్ని ఏరియాల్లో సేఫ్ జోన్‌కు వచ్చేసింది మన శంకరవరప్రసాద్ గారు. ఈ మధ్య కాలంలో మరే ఇతర భారీ సినిమాకు సాధ్యం కాని రికార్డ్ ఇది. అంతేకాదు.. ఇప్పటికే 170 కోట్ల షేర్ కలెక్ట్ చేసి.. చిరంజీవి కెరీర్‌లోనే కాదు.. టాలీవుడ్ హిస్టరీలోనే హైయ్యస్ట్ కలెక్టెడ్ రీజినల్ సినిమాగా నిలిచింది మన శంకరవరప్రసాద్ గారు. 350 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మొదటి రీజినల్ సినిమా మన శంకరవరప్రసాద్ గారు. ఇక నార్త్ అమెరికాలో 3.5 మిలియన్ వసూళ్లతో చిరు, అనిల్.. ఇద్దరికీ టాప్ గ్రాసర్‌గా నిలిచింది. చాన్నాళ్ల తర్వాత 50 కోట్లకు పైగా లాభాలు తెచ్చిన పెద్ద సినిమా ఇదే. అంతేకాదు.. విడుదలైన 5,7, 14వ రోజు ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్స్ తెచ్చింది శంకరవరప్రసాద్. ఫుల్ రన్‌లో ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలిక.

1.5 మిలియన్ డాలర్ల ప్రీమియర్ వసూళ్లతో సీనియర్లలో రికార్డు
బుక్ మై షోలో 3.6 మిలియన్ టికెట్ బుకింగ్స్‌తో ఆల్ టైమ్ రికార్డ్
సంక్రాంతికి వస్తున్నాం 3.5 మిలియన్స్‌తో ప్రీవియస్ రికార్డ్
అల వైకుంఠపురములో రికార్డ్ బ్రేక్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం
6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చిరంజీవి సినిమా
ఇప్పటికే 170 కోట్ల షేర్.. తెలుగులో ఇండస్ట్రీ హిట్..
350 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మొదటి రీజినల్ సినిమా
నార్త్ అమెరికాలో 3.5 మిలియన్ వసూళ్ళు..
చాన్నాళ్ల తర్వాత 50 కోట్లకు పైగా లాభాలు
విడుదలైన 5,7, 14వ రోజు ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్స్

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు

టీడీపీ జెండాతో సెల్‌ టవర్‌ ఎక్కిన వ్యక్తి.. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్

Bhagavanth Kesari Sequel: భగవంత్‌ కేసరికి సీక్వెల్‌.. అరిపించే న్యూస్ చెప్పిన అనిల్

99 రూపాయల సినిమా.. సూపర్ ప్లాన్ గురూ

Spirit: స్పిరిట్‌లో చిరంజీవి.. ఇదిగో మెగా క్లారిటీ