Chiranjeevi: మెగా ప్లానింగ్ అంటే ఇలా ఉంటది.. చిరంజీవిని చూసి నేర్చుకోండి
ఈ రోజుల్లో హీరోలు ఏడాదికి ఒక్క సినిమాకే కష్టపడుతుంటే, మెగాస్టార్ చిరంజీవి మాత్రం 2026లో మూడు సినిమాలు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 70 ఏళ్లు దాటినా, సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్ గారూ', సమ్మర్‌కు 'విశ్వంభర', దసరాకు బాబీ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ అసాధారణ ప్రణాళికతో కుర్ర హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు చిరంజీవి.
ఈ రోజుల్లో హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే నానా తంటాలు పడుతున్నారు. స్టార్ హీరోలైతే రెండేళ్లకోసారి దర్శనమిస్తే అదే పదివేలు. అలాంటిది మెగాస్టార్ మాత్రం మెస్మరైజింగ్ ప్లాన్‌తో ముందుకొస్తున్నారు. అసలు ఈయన ప్లానింగ్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. అన్నీ కుదిర్తే ఏడాది గ్యాప్‌లో 3 సినిమాలతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు చిరు. మరి అదేంటో చూద్దామా..? నిజంగానే తన ప్లానింగ్‌తో పూనకాలు పుట్టించేందుకు సిద్ధమయ్యారు మెగాస్టార్. 70 ఏళ్లు దాటాక కూడా తన జోరుతో కుర్ర హీరోలకు కునుకు లేకుండా చేస్తున్నారు చిరు. ప్లానింగ్ ఉంటే ఎంత ఫాస్ట్‌గా సినిమాలు చేయొచ్చనేది ఈ జనరేషన్‌కు చూపిస్తున్నారు మెగాస్టార్. హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా ఏడాదికి రెండు సినిమాలైతే చేయాలని ఫిక్సైపోయారు చిరంజీవి. 2022లో ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో వచ్చిన చిరు.. 2023లో వాల్తేరు వీరయ్య, భోళా శంకర్‌గా వచ్చారు. 2024, 2025 ఖాళీగా వెళ్లిపోయినా.. 2026లో మాత్రం మూడు సినిమాలు విడుదల చేయాలని చూస్తున్నారు ఈ హీరో. సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారూ విడుదల కానుంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. మన శంకరవరప్రసాద్ గారూలో వింటేజ్ చిరంజీవి కనిపిస్తున్నారు. కథ, కథనాలు పక్కనబెట్టి.. పూర్తిగా 30 ఏళ్ళ నాటి చిరును ప్రజెంట్ చేస్తున్నారు అనిల్. ఇందులో వెంకటేష్ కూడా నటిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. బిజినెస్ పరంగానూ రికార్డులు తిరగరాస్తుంది శంకరవరప్రసాద్. నయనతార ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనిల్ సినిమా వచ్చిన 3 నెలల్లోపే విశ్వంభర విడుదల కానుంది. ఇక జనవరి నుంచి బాబీ సినిమా పట్టాలెక్కించబోతున్నారు మెగాస్టార్. అన్నీ కుదిర్తే ఈ సినిమాని 2026 దసరాకు విడుదల చేయాలని చూస్తున్నారు ఈ హీరో. అంటే సంక్రాంతికి శంకరవరప్రసాద్, సమ్మర్‌కు విశ్వంభర, దసరాకు బాబీ సినిమా రానున్నాయన్నమాట. ప్లానింగ్ అదిరింది.. వర్కవుట్ అయితే ఇంకా అదురుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చనిపోయిన తల్లిలా వేషం వేసిన కొడుకు.. మూడేళ్లుగా రూ. 80 లక్షల పింఛను కోసం నాటకం
Hongkong: అపార్ట్‌మెంట్లలో అగ్నికీలలు పన్నెండు మంది మృతి.. లోపలే చిక్కుకున్న వందలాది మంది
చెవిపోగులు తాకట్టు పెట్టింది.. కట్ చేస్తే కటిక పేదరికం నుండి పెద్ద ధనవంతురాలు అయ్యింది