Tollywood: శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్ చేసుకున్న చిరు.!
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన భోళా శంకర్ సినిమా మాత్రం నిరాశ పరిచింది. ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో చిరు జోడిగా మళ్లీ త్రిష నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన భోళా శంకర్ సినిమా మాత్రం నిరాశ పరిచింది. ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో చిరు జోడిగా మళ్లీ త్రిష నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరలవుతుంది. అదేంటంటే.. ఒకప్పుడు చిరు బ్లాక్ బస్టర్ హిట్ మిస్సయారంట. చిరు చేయాల్సిన సినిమాను కోలీవుడ్ నటుడు అర్జున్ చేసి హిట్టు కొట్టారు. ఇంతకీ ఏ సినిమా అనుకుంటున్నారా ?.. అదే ఒకే ఒక్కడు.
డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పింది ఈ మూవీ. ఇందులో అర్జున్ సరసన మనీషా కొయిరాల కథానాయికగా నటించగా.. రఘువరన్ విలన్ గా కనిపించారు. శంకర్ డైరెక్షన్.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ అయ్యాయి. 1999 నవంబర్ 7న ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై అటు తమిళ్.. ఇటు తెలుగు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుని భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టింది.
అయితే ఈ సినిమాను అటు తమిళంలో.. ఇటు తెలుగులో ఒకేసారి రూపొందించాలని అనుకున్నారట. అటు తమిళంలో అర్జున్.. ఇటు తెలుగులో చిరంజీవితో తెరకెక్కించాలని అనుకున్నారు. అప్పటికే చిరుకు ఈ మూవీ స్టోరీ కూడా వినిపించారు. కథ అద్భుతంగా ఉన్నప్పటికీ చిరు ఆ సమయంలో మరో సినిమాతో బిజీగా ఉండడంతో ఈ సినిమాలో నటించలేకపోయారట. దీంతో రెండు భాషల్లోనూ అర్జున్ తోనే ఈ సినిమాను తెరకెక్కించారు. అలా బ్లాక్ బస్టర్ హిట్ ఒకే ఒక్కడు సినిమాను చిరు మిస్ చేసుకున్నారు. ఒకవేళ చిరు ఈ మూవీ చేసి ఉండే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ కలెక్షన్స్ వచ్చేవి. డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.