Sai Dharam Tej: యాక్సిడెంట్ తర్వాత తొలిసారి కెమెరా ముందుకు సాయితేజ్.. (వీడియో)
ఇటీవల ప్రమాదానికి గురై కోలుకుంటున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సాయిధరమ్ తేజ్‌ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్‌డేట్ ఇచ్చారు.
ఇటీవల ప్రమాదానికి గురై కోలుకుంటున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సాయిధరమ్ తేజ్‌ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్‌డేట్ ఇచ్చారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తేజ్.. కోలుకున్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.
ఈ సందర్భంగా అందరి ఆశీస్సులు, దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడు. మా కుటుంబసభ్యులందరికి ఇది నిజమైన పండుగ” అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుతోపాటు..మెగా యంగ్ హీరోస్ అందరూ ఉన్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నట్లుగా ఫోటోలో కనిపిస్తున్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ తనయుడు అకిరా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం తేజ్ వద్దకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. : ఇదిలా ఉంటే.. ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న సాయితేజ్… ఓ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. కొత్త దర్శకుడు కార్తిక్ దండు డైరెక్షన్ చేస్తుండగా.. సుకుమార్ స్ర్కీన్ ప్లే అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లుగా సమాచారం.
మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..
Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…
Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…