AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా హీరో పై సెటైర్లా.. సారీ చెప్పకపోతే వదిలిపెట్టం

మా హీరో పై సెటైర్లా.. సారీ చెప్పకపోతే వదిలిపెట్టం

Phani CH
|

Updated on: Sep 28, 2025 | 7:13 PM

Share

ఏపీ అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను మెగాభిమానులు తప్పుపడుతున్నారు. దీనికి బాలయ్య వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అఖిల భారత చిరంజీవి యువత సెప్టెంబర్ 25న ఒక ప్రకటన విడుల చేసింది. ఇప్పుడా ప్రకటన తెలుగు టూ స్టేట్స్‌లో సంచలనంగా మారింది.

అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవి ని ఉద్దేశించి వ్యంగంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ మెగా ఫ్యాన్స్‌ తమ ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. తనను తాను అతీత శక్తిగా భావించుకుంటున్న బాలకృష్ణ గతంలో కూడా.. మెగా కుటుంబంపై అనేక సార్లు అవమానకరంగా మాట్లాడారని.. వివాదాలకు దూరంగా ఉండే తమ హీరో చిరంజీవి ఎప్పుడూ వాటిపై స్పందించలేదని.. అభిమానులుగా తాము కూడా ఆయన మనసెరిగి సంయమనం పాటించామని తాము రిలీజ్ చేసిన ప్రకటనలో మెగా ఫ్యాన్స్‌ రాసుకొచ్చారు. బాలకృష్ణ కుటుంబం తీవ్ర వేధింపులకు గురై, జైలు పాలైనప్పుడు ఆయన కుటుంబానికి అండగా నిలిచింది… ఆయన కుటుంబం అధికారంలోకి రావడానికి అహర్నిశలూ కృషి చేసింది మెగా కుటుంబమే అంటూ తమ ప్రకటనలో మెగా ఫ్యాన్ ఫ్యామిలీ కోట్ చేసింది. కానీ విజ్ఞత మరిచి, అధికార మదం తలకెక్కించుకున్న బాలకృష్ణ నేడు చట్టసభల్లో చిరంజీవి ప్రతిష్టను దిగజార్చేవిధంగా మాట్లాడేందుకు తెగించారంటూ రాసుకొచ్చింది. అంతేకాదు బాలయ్య వ్యాఖ్యలు తమ దైవం చిరంజీవిని కూడా బాధించాయని.. ఆయన ప్రతిస్పందన ద్వారా అర్ధమవుతోందంటూ మెగా ఫ్యాన్ ఫ్యామిలీ అభిప్రాయపడింది. మెగా కుటుంబం అండగా నిలవకపోయుంటే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటే మంచిదని హితవు పలుకుతున్నాం. మరోసారి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే మెగా అభిమానుల తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని విన్నవిస్తున్నాం. అంటూ తమ ప్రకటనలో మెగా ఫ్యాన్స్‌ రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రీతూ చౌదరితో…. ****! లీక్ వీడియోపై ధర్మ రియాక్షన్

జాక్ ఎఫెక్ట్ 4 కోట్లు అప్పు చేసి మరీ డిస్ట్రిబ్యూటర్లు తిరిగి ఇచ్చేశా..

ప్రభాస్‌కు కలిసొచ్చిన ఉదయ్‌ తప్పుడు నిర్ణయం !! అప్పట్లో ఏం జరిగిందంటే..?

బిగ్‌ బాస్‌లో ఉన్న సంజనకు బిగ్ ఝలక్! వెంటాడుతోన్న డ్రగ్ కేసు.. సుప్రీం నోటీస్‌!

కన్న కొనడుకుపై తండ్రి షాకింగ్ కామెంట్స్ పాపం! ఆ పెద్దాయన పరిస్థితి.. ఎవరికీ రాకూడదు