‘కల్లు కొట్టు కాడా..’ మార్కెట్లోకి నయా మాస్ మాసాలా సాంగ్! అదిరిపోయే రెస్పాన్స్!
టాలీవుడ్ నుంచి వస్తోన్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మటన్ సూప్. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంది. మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. ఇక ఈక్రమంలోనే ఈ మూవీ నుంచి ఓ మాంచి మాస్ సాంగ్ రిలీజైంది. సీనియర్ నటుడు మురళీ మోహన్ చేతుల మీదుగా బయటికి వచ్చిన ఈ సాంగ్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది.
యూట్యూబ్‌లోనూ మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. రామకృష్ణ వట్టికూటి సమర్పణలో.. అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్‌నెస్ ది రియల్ క్రైమ్’ అనేది ట్యాగ్ లైన్. మల్లిఖార్జున ఎలికా, అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మాతలుగా ఈ మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. ఇటీవల తనికెళ్ల భరణి రిలీజ్ చేసిన ‘హర హర శంకరా’ అనే పాట కూడా మంచి ప్రశంసల్ని దక్కించి, మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ నటుడు మురళీ మోహన్ ‘కల్లు కొట్టు కాడ’ అంటూ సాగే మరో మంచి మాస్ ఎనర్జిటిక్ నంబర్‌ను రిలీజ్ చేశారు. ఈ ప్రత్యేక గీతాన్ని సూరన్న రచించారు. సూరన్న, రేలారే రేలా గోపాల్, సుజాత వాసు కలిసి ఆలపించారు. వెంకీ వీణ సంగీతం అందించారు. సత్య మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇన్‌స్టాలో పరిచయం.. పార్టీ పేరుతో స్కెచ్.. బాత్రూమ్‌లోకి పడేసి.. అత్యాచారం?
Dulquer Salmaan: వివాదంలో కొత్త లోక.. దిగొచ్చి క్షమాపణ చెప్పిన దుల్కర్
ఒళ్లు గగుర్పొడిచే సీన్స్.. ఓటీటీలో అత్యంత భయానక హారర్ థ్రిల్లర్ మూవీ..
