మార్చి యుద్ధం.. 2 వారాల్లో 4 పాన్ ఇండియా సినిమాలు
మార్చి 2026 సినీ ప్రపంచానికి భారీ నెల కానుంది. యష్ 'టాక్సిక్', రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' మార్చి 19న, నాని 'ప్యారడైజ్' మార్చి 26న, రామ్ చరణ్ 'పెద్ది' మార్చి 27న విడుదల కానున్నాయి. ఒకే నెలలో ఇంతమంది అగ్రతారల సినిమాలు రావడం నిర్మాతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఈ బాక్సాఫీస్ యుద్ధంలో ఎవరు నెగ్గుతారో చూడాలి.
మార్చ్ 2026.. ఈ నెల పేరు వింటేనే నిర్మాతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయిప్పుడు. మామూలుగా అయితే సమ్మర్‌లో కానీ సినిమాల సందడి మొదలవ్వదు.. కానీ 2026లో మాత్రం కాస్త ఎర్లీగానే రచ్చ షురూ అవుతుంది. మరీ ముఖ్యంగా ఎవరికి వాళ్లు మేమొస్తున్నాం అంటున్నారు. మరి నెక్ట్ ఇయర్ పీక్ సమ్మర్‌కు ముందు రాబోయే ఆ సినిమాలేంటి..? 2026 మార్చ్ చాలా భారీగా ఉండబోతుంది.. ఎవరికి వాళ్లు మేమొస్తున్నాం అంటున్నారు. ముందలాగే అంటారు కానీ చివరి వరకు ఎవరో ఒకరు తగ్గుతారులే అనుకుంటే.. నో తగ్గేదే లే అంటున్నారు వాళ్లు. మార్చ్ 19 నుంచి ఆ రచ్చ మొదలు కానుంది. ఆ రోజు యశ్ టాక్సిక్ విడుదల కానుంది.. 100 డేస్ టూ గో అంటూ ఈ మధ్యే పోస్టర్ దించారు మేకర్స్. అదేరోజు ధురంధర్ సీక్వెల్ రానుంది. మామూలుగా అయితే హిందీ సినిమా వచ్చినపుడు పెద్దగా టెన్షన్ పడాల్సిన పనుండదు.. కానీ ధురంధర్ దూకుడు చూస్తుంటే మన వాళ్లకు కూడా గండికొట్టేలా ఉంది. ప్రస్తుతం బాక్సాఫీస్‌ను చీల్చి చెండాడేస్తున్నారు రణ్వీర్ సింగ్. దీని సీక్వెల్ మార్చి 19న విడుదల కానుంది. టాక్సిక్‌కు కచ్చితంగా ప్యాన్ ఇండియా వైడ్‌గా ధురంధర్‌తో పోటీ తప్పదు. మార్చి 19న పోటీ అలా ఉంటే.. 26, 27న మరోలా ఉండబోతుంది. నాని నటిస్తున్న ప్యారడైజ్ సినిమా మార్చి 26న విడుదల కానుందని ముందు నుంచే చెప్తున్నారు. అయితే షూటింగ్ ఆలస్యమవుతుంది.. అనుకున్న టైమ్‌కు రావడం కష్టమే అనే టాక్ వినిపించినా.. తాజాగా శ్రీకాంత్ ఓదెల బర్త్ డే మేకింగ్ వీడియోలోనూ సేమ్ డేమ్ మరోసారి లాక్ చేసారు మేకర్స్. మార్చి 27న రామ్ చరణ్ పెద్ది రాబోతుంది. దీనికి ఎలాంటి ఇబ్బందులు లేవు.. పక్కా ప్లానింగ్‌తో సినిమాను సిద్ధం చేస్తున్నారు బుచ్చిబాబు. ఉప్పెన తర్వాత ఆయన చేస్తున్న సినిమా కావడం.. చరణ్ మరోసారి పూర్తిగా రూరల్ లుక్‌లోకి మారిపోవడంతో పెద్దిపై అంచనాలు అలా పెరిగిపోతున్నాయి. మొత్తానికి ఈ మార్చి యుద్ధంలో ఎవరు నెగ్గుతారో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
Vijayawada: బెజవాడ రైల్వే స్టేషన్‌లో పార్కింగ్ దోపిడీ
డీమాన్‌ని ఢీ కొట్టి బొక్కబోర్లా పడ్డ కళ్యాణ్.. తనూజ దెబ్బకు షాక్‌లోకి
Pawan Kalyan: పవన్ డ్యాన్స్ ఎఫెక్ట్ షేక్ అవుతున్న సోషల్ మీడియా..
