Kannappa: హిట్టా..? ఫట్టా..? కన్నప్ప ఫుల్ రివ్యూ

Updated on: Jun 27, 2025 | 8:11 PM

సినిమా చరిత్రలో కొన్నిటిని క్లాసిక్స్ గా చెప్పుకుంటాం. తరాలు మారినా తరగని ఆస్తులుగా పరిగణిస్తుంటాం.! అలాంటి క్లాసిక్స్ నవతరాన్ని ఎప్పుడూ ఊరిస్తూనే ఉంటాయి. ఓ సారి ట్రై చేయమని కన్నుగీటుతూనే ఉంటాయి. అలా ఊరించిన సబ్జెక్టే కన్నప్ప. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు కెరీర్‌లో కలికితురాయి ఈ మూవీ. అలాంటి సబ్జెక్టును యంగ్‌ రెబల్‌ స్టార్‌ వదులుకుంటారా? అనే ప్రశ్నలన్నింటినీ దాటి.. ఇప్పుడు సిల్వర్‌స్క్రీన్‌ మీద సరికొత్తగా ల్యాండ్‌ అయింది కన్నప్ప మూవీ.

ఇంతకీ మంచు విష్ణు మలిచిన ఈ కన్నప్ప కథ ఎలా ఉంది? ప్రభాస్‌ క్యారెక్టర్ పొందిగ్గా కుదిరిందా? అతిథులందరూ ఫైనల్‌ కట్‌ చూసుకుని ఆనందంగానే ఉన్నారా? తెలుసుకోవాలంటే ఈ డీటేయిల్డ్‌ రివ్యూ చూసేండి. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంటాడు తిన్నడు అలియాస్ అవ్రామ్‌. తండ్రి నాదనాథుడు అలియాస్ శరత్‌కుమార్‌, కొడుకును అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. వారున్న గూడేనికి నాదనాథుడే నాయకుడు. అమ్మవారికి నరబలి ఇచ్చే ఆచారం ఉంటుంది. ఓ సారి తిన్నడి స్నేహితుడు బలి అవుతాడు. అప్పటి నుంచీ దేవుడు లేడని నాస్తికత్వాన్ని పెంచుకుంటాడు తిన్నడు. ప్రతి విషయాన్నీ తర్కిస్తుంటాడు. వీరిలాంటివే.. చుట్టుపక్కల మరో నాలుగు గూడేలు ఉంటాయి. ఈ ఐదు గూడేలు ఎప్పుడూ కలిసికట్టుగా ఉండవు. కానీ ఒక్క విషయంలో మాత్రం కలిసికట్టుగా ఉంటారు. అక్కడికి దగ్గరలో వాయు లింగం ఉంటుంది. దాన్ని పెకలించుకుని పోవడానికి కాలముఖుడు దండయాత్ర చేస్తాడు. అప్పుడు ఈ గూడెంలో ఉన్న ప్రజలంతా ఏకమవుతుంటారు. ఆ క్రమంలో జరిగిన మాటల్లోనే తిన్నడిని నాయకుడిగా ఎన్నుకుంటారు. ఇక పన్నగ గూడేనికి చెందిన యువరాణి నెమలి అలియాస్ ప్రీతీ ముకుందన్‌ని తిన్నడు ఇష్టపడతాడు. వారిద్దరి ప్రేమ కారణంగా ఐదు గూడేల మధ్య కలహాలు ఏర్పడతాయి. ప్రజల శ్రేయస్సు కోసం తిన్నడిని తన స్థావరం నుంచి బహిష్కరిస్తాడు తండ్రి నాదనాథుడు. తండ్రి మాటను పాలించిన తిన్నడు బయటికెళ్తాడు. అతనితోనే ఉంటానంటూ నెమలి కూడా తన స్థావరం నుంచి వెళ్తుంది. తిన్నడు నాస్తికుడైతే, నెమలికి శివుడే అన్నీ. తల్లిని, కుటుంబాన్ని వదిలి వచ్చిన నెమలి.. ఒకానొక సమయంలో శివుడి కోసం తిన్నడితో గొడవ పడుతుంది..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీట్‌ మాక్‌ టెస్ట్‌లో మార్కులు తక్కువొచ్చాయని కూతురిని చితకబాదిన తండ్రి.. కట్‌చేస్తే

అడవిలో భారీ మనిషి ఆకారం.. దగ్గరకెళ్లి చూడగా

కొలనులో కొండచిలువ.. అది కక్కింది చూసి జనం షాక్‌

గ్యాస్‌ సిలిండర్ల సరఫరా ఆగిపోనుందా.. కారణం అదేనా ??

ఎలక్ట్రిక్‌ విమానం వచ్చేసింది.. ఒక్కసారి చార్జి చేస్తే.. 463 కి.మీ