‘వెళ్లి నాన్న కాళ్లపై పడాలని ఉంది’ మంచు మనోజ్ ఎమోషనల్
మంచు మనోజ్ కు మంచు విష్ణుకు మధ్య జరుగుతున్న వివాదాల గురించి తెలిసిందే..! మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబుతో జరుగుతున్న కుటుంబ వివాదాల నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో భావోద్వేగంతో మాట్లాడారు. తన తండ్రిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. తమ కుంటుంబంలో మునుపటి పరిస్థితులు రావాలని కోరుకున్నాడు.
ఇప్పటికి కూడా.. తన నాన్న కాళ్ళు పట్టుకోవాలని తన పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు మంచు మనోజ్. కానీ, చేయని తప్పుని అంగీకరిస్తే..? తన పిల్లలకు తానేం నేర్పిస్తా..? మా నాన్న నేర్పించిన నీతి ఇది. అందుకే తాను ముందుకెళ్లలేకపోతున్నా అన్నాడు.తామంతా మళ్లీ కలిసి ఉండాలని రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నా..అంటూ చెప్పాడు. సమస్యలు సృష్టించిన వారు తమ తప్పుని తెలుసుకుంటారనే నమ్మకం కూడా ఉందన్నాడు మనోజ్. మనోజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఆయన నటించిన భైరవం సినిమా విడుదల కానుంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ కలిసి నటిస్తున్నారు. మే 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమాతో మంచి సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని అయన అభిమానులు కోరుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉన్నట్టుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. నాని బిగ్ సర్‌ప్రైజ్
నేనూ అమ్మాయినే.. నాకూ పీరియడ్స్ వస్తాయి.. మరీ ఇంత బోల్డా
సినిమాల్లోకి, రాజకీయాల్లోకి రాకుంటే.. పవన్ ఏం అయ్యేవారో తెలుసా?
నక్కతోక తొక్కడం అంటే ఇదేనయ్యో.. అల్లు అర్జున్ సినిమాలో పాన్ ఇండియా బ్యూటీ..
తొమ్మిదేళ్లప్పుడు మిస్సింగ్.. గూగుల్ మ్యాప్ సాయంతో.. 38 ఏళ్ల ఏజ్లో పేరెంట్స్ చెంతకు..

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..

ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా.

కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్

ఒకే గుంతలో పులి, కుక్క.. తర్వాత ఏం జరిగిందంటే..

కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో

ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
