దెయ్యంతో దోస్తానా.. బాక్సాఫీస్ బొనాంజా
దెయ్యం అంటే అంతా భయపడుతుంటారు కానీ బాలీవుడ్ మేకర్స్ మాత్రం రా రమ్మంటూ ఆహ్వానిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే దెయ్యాలను వాళ్లు దత్త పుత్రికల్లా చూసుకుంటున్నారు. ఈ దెయ్యాల సినిమాలకు ఉన్న క్రేజ్ చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. నార్త్ నిర్మాతలకు కాసులు కురిపిస్తున్నాయి ఈ దెయ్యాలు. మరి వాళ్ల కథేంటో చూద్దామా..? థామా సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా వసూళ్లు మాత్రం బాగా గట్టిగానే వస్తున్నాయి.
ముఖ్యంగా రష్మిక మందన్న నటనకు ఫిదా అయిపోతున్నారు నార్త్ ఆడియన్స్. అలాగే నవాజుద్దీన్ సిద్ధికీ, ఆయుష్మాన్ ఖురానా సైతం థామాకు అడ్వాంటేజ్ అయ్యారు. ఈ సినిమాకు 3 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ అందుకునేలా కనిపిస్తుంది. గతంలో ఇదే మ్యాడాక్ బ్యానర్ నుంచి వచ్చిన స్త్రీ 2 సినిమాకు 800 కోట్లు రావడంతో.. దెయ్యాల సినిమాలపై మరోసారి గిరాకీ పెరిగింది. అవసరం ఉన్నా లేకపోయినా.. ఓ దెయ్యం సినిమా తీస్తే సరిపోద్దిలే అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు మిస్ ఫైర్ కూడా తప్పదు. ఫామ్‌లో లేని సంజయ్ దత్ కూడా భూతిని అంటూ డెవిల్ స్టోరీతో వచ్చి చేతులు కాల్చుకున్నారు. తనకు హీరోగా మార్కెట్ లేదని తెలిసినా.. దెయ్యంపై నమ్మకంతో భూతిని చేసారు సంజయ్ దత్. సిద్ధాంత్ సచ్‌దేవ్ తెరకెక్కించిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. తెలుగులోనూ రాజా సాబ్‌లో దెయ్యంగానే కనిపిస్తున్నారు సంజూ బాబా. ఈ మధ్య కాలంలో స్త్రీ 2, భూల్ భులయ్యా 3, ముంజ్యా లాంటి సినిమాలతో దెయ్యాలకు పుట్టిల్లు అయిపోయింది బాలీవుడ్. కాస్త భయపెట్టి నవ్విస్తే చాలు వందల కోట్లు ఇచ్చేస్తున్నారు ఆడియన్స్. అందుకే అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు మేకర్స్. మ్యాడాక్ ఫిల్మ్స్ అయితే.. రాబోయే మూడేళ్లలో తమ బ్యానర్ నుంచి ఏకంగా 8 హార్రర్ సినిమాలను తీసుకొస్తున్నారు. స్త్రీ 3, భేడియా 2, ముంజియా 2, పెహ్లా మహాయుధ్, దూస్రా మహాయుధ్, శక్తి షాలిని లాంటి సినిమాలు ఈ బ్యానర్ నుంచి రానున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సలార్ సినిమాను వదులకుని చరణ్ తప్పు చేశాడా ??
ఆకాశంలో అద్భుత దృశ్యం.. పులకించిపోయిన భక్తులు
ఆన్‌లైన్‌లో రూ.4 కోట్ల వాచ్ ఆర్డర్ చేశాడు.. డెలివరీ వచ్చింది చూసి
జాతి వైరం మరచి.. పసికూనల ఆకలి తీర్చి
చూసి తీరాల్సిన రిచ్ కంట్రీ ఏడుగురే ఖైదీలు.. వంద మంది పోలీసులు
