Koratala siva – Srimanthudu: సుప్రీం కోర్టులో కొరటాలకు చుక్కెదురు.! ఆ కథ కాపీ అని నమ్మిన కోర్టు.

Updated on: Jan 30, 2024 | 4:04 PM

ఓ సినిమాకు కథే హీరో.. అందుకే కథ సెట్‌ చేసేందుకే డైరెక్టర్లందరూ అష్ట కష్టాలు పడుతుంటారు. తమకు తోచిన, తట్టిన, ఇన్‌స్పెయిర్ చేసిన లైన్స్‌తో.. స్టోరీని డెవలప్ చేస్తుంటారు. సినిమాలు చేసి హిట్స్‌ కొడుతుంటారు. దాంతో పాటే అప్పుడప్పుడూ.. ఆ కథ విషయంలో కాపీ క్యాట్ చిక్కులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక తాజాగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కూడా.. ఇలాంటి చిక్కుల్లోనే ఇరుకున్నారు. సుప్రీం వరకు వెళ్లి పోరాడినా కూడా.. ఫలితం లేకపోవడంతో.. ఇంకొకరి కథ కాపీ చేశారనే అనే కామెంట్స్ తాజాగా నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నారు.

ఓ సినిమాకు కథే హీరో.. అందుకే కథ సెట్‌ చేసేందుకే డైరెక్టర్లందరూ అష్ట కష్టాలు పడుతుంటారు. తమకు తోచిన, తట్టిన, ఇన్‌స్పెయిర్ చేసిన లైన్స్‌తో.. స్టోరీని డెవలప్ చేస్తుంటారు. సినిమాలు చేసి హిట్స్‌ కొడుతుంటారు. దాంతో పాటే అప్పుడప్పుడూ.. ఆ కథ విషయంలో కాపీ క్యాట్ చిక్కులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక తాజాగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కూడా.. ఇలాంటి చిక్కుల్లోనే ఇరుకున్నారు. సుప్రీం వరకు వెళ్లి పోరాడినా కూడా.. ఫలితం లేకపోవడంతో.. ఇంకొకరి కథ కాపీ చేశారనే అనే కామెంట్స్ తాజాగా నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే..! కొరటాల శివ.. సూపర్ స్టార్ మహేష్‌ బాబు హీరోగా.. 2015లో శ్రీమంతుడు సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కూడా కొట్టారు. కట్ చేస్తే ఆ సినిమా స్టోరీ తనదని.. రచయిత చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. అంతకు ముందు స్వాతి మ్యాగజైన్లో ప్రచురించిన తన కథను కాపీ కొట్టే.. కొరటాల శివ శ్రీమంతుడు సినిమాను తెరకెక్కించారని కోర్టుకు మొరపెట్టుకున్నారు. రచయిత చంద్ర మొరను ఆలకించిన కోర్టు.. సాక్ష్యాధారాలన్నింటినీ పరిశీలించి.. అప్పట్లో కొరటాల పై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. ఇక దీన్ని ఒప్పుకోని కొరటాల.. నాపంల్లి కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. సుప్రీం ను ఆశ్రయించారు. అయితే సుప్రీం కోర్టు తాజాగా ఈ కేసులో తీర్పునిచ్చింది. నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. దీంతో కొరటాలకు నిరాశే ఎదురైనట్టు అయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos