Arundhati Nair: ఇదేం పాడు బుద్ధి.! నటి చావు బ్రతుకుల మధ్య ఉన్నా.. ఆగని ట్రోల్స్.!
కోలీవుడ్ హీరోయిన్ అరుంధతి నాయర్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుంది. మార్చి 14న చెన్నైలో ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత తన సోదరుడితో కలిసి బైక్ పై ఇంటికి తిరిగి వస్తుండగా.. తిరువనంతపురంలోని చెన్నై, కోవలం బైపాస్ రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుంధతి తల కు తీవ్ర గాయాలయ్యాయి.
కోలీవుడ్ హీరోయిన్ అరుంధతి నాయర్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుంది. మార్చి 14న చెన్నైలో ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత తన సోదరుడితో కలిసి బైక్ పై ఇంటికి తిరిగి వస్తుండగా.. తిరువనంతపురంలోని చెన్నై, కోవలం బైపాస్ రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుంధతి తల కు తీవ్ర గాయాలయ్యాయి. సుమారు గంటపాటు రోడ్డుపై అపస్మారకస్థితిలో పడి ఉన్న ఆమెను స్థానికులు చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడం ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఇక తాజాగా తన సోదరి చికిత్సకు ఎలాగైనా సాయం చేయాలంటూ అరుంధతి చెల్లెలు ఆర్తి మీడియా ముందుకు వచ్చింది. ఆసుపత్రి బిల్లులు చెల్లించడానికి కూడా డబ్బుల్లేవని.. ఇప్పుడు ఆసుపత్రి చుట్టూ పరుగులు పెడుతున్నామని.. కానీ ఇలాంటి సమయంలో తమను దారుణంగా ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ప్రస్తుతం తన సోదరికి బ్రెయిన్ సర్జరీ చేయించాలని.. అందుకు త్రివేండ్రంలోని అనంతపూరి ఆసుపత్రిలో చేర్పించామని చెప్పుకొచ్చింది ఆర్తి. ఇప్పుడు ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని.. ఇప్పటికే 5 లక్షలకు పైగా ఖర్చు చేశామని.. ట్రీట్మెంట్ పూర్తయ్యేసరికి ఇంకా ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేమని .. సాయం చేయాలంటూ కోరింది.అయితే అరుంధతికి సాయం చేయాలని గత నాలుగైదు రోజులుగా ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులు సోషల్ మీడియా ద్వారా వేడుకుంటున్న ఇప్పటివరకు ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎలాంటి సాయం.. అందలేదు న్యూస్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.